Begin typing your search above and press return to search.

ఎంత మంది వద్దన్నా.. రానా వదిలేలా లేడు..

రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయన్ లో లో కనిపించారు. అదే సమయంలో ప్రొడక్షన్ పై దృష్టి సారిస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2024 12:30 PM GMT
ఎంత మంది వద్దన్నా.. రానా వదిలేలా లేడు..
X

టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా.. హీరోగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి రెండేళ్లు దాటిపోయింది. విరాటపర్వంతో చివరగా అలరించిన ఆయన.. హీరోగా మరో మూవీని రిలీజ్ చేయలేదు. కానీ క్యామియో రోల్స్ లో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయన్ లో లో కనిపించారు. అదే సమయంలో ప్రొడక్షన్ పై దృష్టి సారిస్తున్నారు. చిన్న సినిమాలను పుష్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం 35 చిన్న కథ కాదు మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

నివేదా థామస్, విశ్వ దేవ్, ప్రియదర్శి లీడ్ రోల్స్ నటించిన ఆ సినిమా.. అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ అందుకుంటోంది. అయితే రానా.. ఇటీవల బాలీవుడ్ మూవీ జిగ్రాను తెలుగులో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సూపర్ హిట్ కోలీవుడ్ మూవీని బాలీవుడ్ లోకి రీమేక్ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది ఏ సినిమా అంటే.. స్టార్ హీరో శింబు నటించిన మానాడు.

2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది. శింబుతో పాటు ఎస్ జే సూర్య కెరీర్ కు బాగా ఉపయోగపడింది. ది లూప్‌ పేరుతో తెలుగు ప్రేక్షకులకు కూడా డబ్బింగ్ వెర్షన్ రూపంలో మంచి థ్రిల్‌ పంచింది. అయినా.. తెలుగులో రీమేక్ చేద్దామని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అప్పట్లో నిర్ణయించుకుంది. అందుకు రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కించలేదు. సరైన హీరో దొరక్కపోవడమే కారణమని ఎప్పటి నుంచో టాక్ వస్తోంది.

టాలీవుడ్ హీరోలు సాయి దుర్గా తేజ్, వరుణ్ తేజ్, రవితేజ... వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు మానాడు తెలుగు రీమేక్ చేస్తారని వార్తలు వచ్చినా అది జరగలేదు. ఇప్పుడు మానాడును బాలీవుడ్ లోకి రీమేక్ చేయాలని రానా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 2021లో రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మించిన ఆకాశవాణి మూవీతో దర్శకుడిగా పరిచయమైన అశ్విన్ గంగరాజు.. తెరకెక్కించనున్నారని సమాచారం. హిందీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్ తో తీయాలని అనుకుంటున్నారట.

హీరోను ఇంకా ఫిక్స్ చేయకపోయినా.. రానా మాత్రం నటించడం లేదని టాక్ వినిపిస్తోంది. తన స్పిరిట్ మీడియా బ్యానర్ పై భారీ బడ్జెట్ తో మూవీని నిర్మించనున్నారని సమాచారం. అయితే ఇప్పటికే సౌత్ లో సూపర్ హిట్ అయిన పలు చిత్రాలు.. బాలీవుడ్ లోకి రీమేక్ అయ్యాయి. అందులో కొన్ని హిట్స్ అవ్వగా.. మరికొన్ని ఫ్లాపులుగా మారాయి. దీంతో రానా.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మానాడు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారట. మరి మానాడు హిందీ రీమేక్ ఎలా ఉంటుందో చూడాలి.