Begin typing your search above and press return to search.

రానాకు ఆ విషయం ఇప్పటికీ అర్ధం కావడం లేదట!

కానీ ఇప్పటికీ సినీ ప్రియులు.. ఎలాంటి చిత్రాల వైపు మొగ్గు చూపుతారో తెలుసుకోవడంలో ఫెయిల్ అవుతున్నట్లు చెప్పారు రానా.

By:  Tupaki Desk   |   19 Oct 2024 2:30 AM GMT
రానాకు ఆ విషయం ఇప్పటికీ అర్ధం కావడం లేదట!
X

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ముఖ్య పాత్రల్లో అనేక సినిమాల్లో కనిపించి సినీ ప్రియులను అలరించారు. తన నటనతో మెప్పించారు. కొంత కాలంగా ప్రొడక్షన్ వైపు దృష్టి సారిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలు నిర్మిస్తున్నారు. అందరి మెప్పు పొందుతున్నారు. 2024లో నిర్మాతగా రానా ఇప్పటికే రెండు సినిమాలు తీసుకొచ్చారు.

రీసెంట్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో హిస్టరీ క్రియేట్ చేసిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ ఇండియా హక్కులను సొంతం చేసుకున్నారు. పాపల్ కపాడియా తెరకెక్కించిన ఆ సినిమా.. వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ముంబయి నర్సింగ్‌ హోమ్‌ లో పనిచేసే ఇద్దరు నర్సుల కథ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా.. తాజాగా ఆసియా పసిఫిక్‌ స్క్రీన్‌ పురస్కారాల్లో సత్తా చాటింది.

ఉత్తమ సినిమా, డైరెక్టర్, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. నవంబర్ 30వ తేదీన ఆస్ట్రేలియాలో అవార్డుల వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ఇండియా రైట్స్ ను సొంతం చేసుకున్న రానా.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటిపోయిందని week తెలిపారు.

కానీ ఇప్పటికీ సినీ ప్రియులు.. ఎలాంటి చిత్రాల వైపు మొగ్గు చూపుతారో తెలుసుకోవడంలో ఫెయిల్ అవుతున్నట్లు చెప్పారు రానా. కేవలం బడా హీరోల సినిమాలే కాకుండా.. మంచి స్టోరీ, ఎమోషన్ తో ఉన్న ఏ మూవీ అయినా తన స్పెషాలిటీ చాటుకుంటుందని అర్థమైనట్లు తెలిపారు. 2004లో రూపొందిన బొమ్మలాట మూవీకి తాను నిర్మాతగా వ్యవహరించినట్లు వెల్లడించారు. ఆ సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు.

బొమ్మలాట మూవీకి నేషనల్ అవార్డు వచ్చిందని, కానీ ఆ సినిమా థియేటర్లలో విడుదల కాలేదని చెప్పారు. రిలీజ్ కోసం థియేటర్లను వెతుక్కోవాల్సి వచ్చిందని తెలిపారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు హిట్ చేస్తారన్న నమ్మకం తనకు ఉందని వెల్లడించారు. ప్రపంచంలోని ఇతర భాషల్లో ఉన్నట్లు ఇక్కడ మేకర్స్ కు గ్రాంట్లు ఉండవని అన్నారు. ప్రస్తుతం రానా వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.