రానా ఇంట్లో రెండు దీపాలు
అయితే రెండేళ్ల నుంచి మాత్రం రెండు సంప్రదాయలు తూచ తప్పకుండా పాటించాల్సి వస్తోంది. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి తెలుగు పద్దతి ప్రకారం పండుగ చేసేవాడిని.
By: Tupaki Desk | 12 Nov 2023 11:30 AM GMTసెలబ్రిటీలంతా దీపావళి పండుగలో నిమగ్నమయ్యారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ ఎలా షురూ చేస్తున్నారు? అన్నది ఒక్కొక్కరుగా షేర్ చేస్తున్నారు. దీపాల పండుగ ప్రత్యేకతని చెబుతున్నారు. తాజాగా రానా కూడా తన అనుభూతిని పంచుకుంటున్నాడు. రానా ఇంట్లో దీపావళి అంటే కచ్చితంగా రెండు సంప్రదాయల్లో జరుగుతుంది. ఒకటి తెలుగు సంప్రదాయం అయితే మరొకటి మరాఠీ పద్దతి ప్రకారం అంటున్నారు.
'మతాబులు కాల్చడంలో ముందుంటా. అయితే రెండేళ్ల నుంచి మాత్రం రెండు సంప్రదాయలు తూచ తప్పకుండా పాటించాల్సి వస్తోంది. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి తెలుగు పద్దతి ప్రకారం పండుగ చేసేవాడిని. కానీ మిహీకా వచ్చాక మరాఠీ పద్దతిలోనూ చేస్తున్నాం. మరాఠీ వాళ్లు ఐదు రోజుల సెలబ్రేట్ చేస్తారు. రకరకాల వంటకాలతో విందు భోజనాలు ఉంటాయి. వాటిలో స్వీట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇల్లాంతా స్వీట్లే కనిపిస్తాయి. మిహికా వల్లే నాకు ఈ సంప్రదాయం గురించి తెలిసింది. వాళ్ల పద్దతిని నేను అంతే గౌరవిస్తా..తెలుగు పద్దతిని ఆమె అంతే రెస్పక్ట్ చేస్తుంది. అందుకే ఇంట్లో రెండు పద్దతుల ప్రకారం సెలబ్రేట్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఫీలయ్యే పని ఉండదు. నా పద్దతి లో చేసి తన పద్దతి ప్రకారం తప్పు అనడం కరెక్ట్ కాదు. అందుకే ఇద్దరం రెండు పద్దతులు ఫాలో అవుతాం' అన్నారు.
మొత్తానికి ఏటా రానా ఇంట్లో దీపావళి అంటే రెండు దీపాలు పెట్టాల్సిందే అన్న మాట. రానా-మిహీకా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. సరైన కథల కోసం ఎదురుచూస్తున్నాడు. భారీ ఎత్తున పాన్ ఇండియాని షేక్ చేసే కథలతోనే వస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఇక మిహీకా ప్రపంచం వేరు. ఆమె సినిమాలకు దూరంగా ఉంటారు.