మిహికా, రానా.. స్పెషల్ డే లవ్లీ లుక్
ఇదిలా ఉంటే రానా, మిహికా కలిసి దిగిన ఫోటోలని ఆమె చాలా రేర్ గా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటారు. తాజాగా వీరిద్దరూ నాలుగో వివాహ వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు.
By: Tupaki Desk | 8 Aug 2024 12:11 PM GMTటాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ మిహికా బజాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2020లోనే వీరి వివాహం జరిగింది. అయితే మిహికా బజాజ్ సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న కూడా ఇంటీరియర్ డిజైనర్ గా ఆమె చాలా బిజీగా ఉన్నారు. పెద్ద పెద్ద సంస్థలతో కలిసి మిహికా వర్క్ చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే రానా, మిహికా కలిసి దిగిన ఫోటోలని ఆమె చాలా రేర్ గా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటారు. తాజాగా వీరిద్దరూ నాలుగో వివాహ వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. అంటే వీరిద్దరి పెళ్లి జరిగి నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మిహికా ఇన్ స్టాగ్రామ్ లో ఫారిన్ లో కలిసి హ్యాపీగా కలిసి తిరుగుతున్న ఫోటోని షేర్ చేసింది.
అలాగే తమ నాలుగేళ్ల బంధం గురించి భావోద్వేగ అనుబంధం గురించి పోస్ట్ లో రాసింది. జీవితం ఎప్పుడు సరదాగా ఉండదు. ప్రతి రోజు ఉన్న ఎన్నో గందరగోళాల మధ్యలో మీరే నా ప్రశాంతత. సముద్రంలా ఎన్ని మార్పులు వచ్చిన నువ్వు ఎల్లప్పుడూ నా పక్కన ఉండటం చాలా ఆనందంగా ఉంది. నీ మీద నాకున్న ప్రేమకంటే గొప్పది మరొకటి లేదు.
ఇన్ఫినిటీ అండ్ బియాండ్ లవ్ అంటూ మిహికా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఆమె షేర్ చేసిన పోస్ట్ లో రానా, మిహికా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ హ్యాపీగా కలిసి వెళ్తున్నట్లు ఉంది. వివాహ వార్షికోత్సవం సందర్భంగా సెలబ్రెటీలు చాలా మంది మిహికా, రానాకి విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే ఇలాగే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉండాలని బ్లెస్సింగ్ చేస్తున్నారు.
ఈ ఫోటో చూస్తుంటే పెర్ఫెక్ట్ కపుల్స్ కి సింబాలిక్ గా ఉన్నారంటూ దగ్గుబాటి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మిహికా ఈ పిక్స్ క్యూట్ గా హ్యాపీగా ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి వార్షికోత్సవాలు మరిన్ని మీరు చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటూ విషెస్ తెలియజేస్తున్నారు.