ఆ ప్రముఖ హీరోయిన్ కు రానా క్షమాపణలు
సోషల్‌మీడియా వేదికగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌కు సారి చెప్పారు. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌ను కూడా క్షమించమని కోరారు.
By: Tupaki Desk | 15 Aug 2023 10:33 AM GMTప్రముఖ నటుడు రానా దగ్గుబాటి.. గతంలో తాను చేసిన వ్యాఖ్యల విషయంలో ఇప్పుడు క్షమాపణలు చెప్పారు. సోషల్‌మీడియా వేదికగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌కు సారి చెప్పారు. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌ను కూడా క్షమించమని కోరారు. తన వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థంచేసుకుంటున్నారని, అలా అనుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
"నా మాటల వల్ల సోనమ్ కపూర్‌పై జరుగుతున్న నెగిటివిటీ ప్రచారం నన్ను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. అందులో ఎటువంటి పూరిగా నిజం లేదు. ఇది ఎంతో తేలికగా, సరదాగా తీసుకోవాల్సిన విషయం. మేమంతా స్నేహితులులాగా సరదాగా ఆట పట్టించుకుంటాం. కానీ ఇక్కడ నా మాటలు తప్పుగా అన్వయం అయ్యాయి. దీనికి నేను ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నాను. సోనమ్ కపూర్-దుల్కర్‌కు క్షమాపణలు చెబుతున్నాను. వారిద్దరు అంటే నాకెంతో గౌరవం. ఈ కాంట్రవర్సీ.. నా వివరణతో ముగింపు పలుకుతుందని అనుకుంటున్నాను" అని రానా పేర్కొన్నారు.
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్‌స్టర్ సినిమా కింగ్ ఆఫ్ కొత్త ఆగష్టు 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ముఖ్య అతిథిగా వచ్చిన రానా దుల్కర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. "దుల్కర్ ఎంతో సింపుల్ సహనంగా ఉండే వ్యక్తి. గతంలో దుల్కర్ సల్మాన్ చేసిన ఓ హిందీ సినిమా ప్రొడ్యూసర్స్ నా స్నేహితులు. ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరగుతున్నప్పుడూ మూవీ సెట్స్‌కు వెళ్ళాను. ఆ సినిమాలో నటిస్తున్న ఓ బాలీవుడ్ హీరోయిన్ దుల్కర్‌ను చాలా వెయిట్ చేయించింది. మీద టేకులు తీసుకుంది. షాపింగ్ గురించి భర్తతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంది. కానీ దుల్కర్ మాత్రం ఎండలో సహనంగా ఉన్నాడు. " అని రానా అన్నారు.
దీంతో రానా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అంటూ సోషల్ మీడియాలో నెగిటివిటీ ప్రచారం సాగింది. సోనమ్‌కు క్రమశిక్షణ లేదంటూ కామెంట్లు వచ్చాయి. దీంతో రానా సోనమ్-దుల్కర్‌కు సారీ చెప్పారు. ఎంతో బాధగా ఉందని అన్నారు.