Begin typing your search above and press return to search.

ఆ మాటకొస్తే శ్రీ‌రాముడు ఏక‌ప‌త్నీవృతుడు!

శ్రీ‌రాముడు ఏక‌ప‌త్నీవృతుడు. స‌జ్జ‌నుడు. స‌ద్గుణ‌ములు క‌లిగిన మంచి బాలుడు.

By:  Tupaki Desk   |   12 Jun 2024 5:27 AM GMT
ఆ మాటకొస్తే శ్రీ‌రాముడు ఏక‌ప‌త్నీవృతుడు!
X

శ్రీ‌రాముడు ఏక‌ప‌త్నీవృతుడు. స‌జ్జ‌నుడు. స‌ద్గుణ‌ములు క‌లిగిన మంచి బాలుడు. అందుకే అత‌డు ప్ర‌పంచంలోని పురుషులంద‌రికీ ఆద‌ర్శ‌పురుషుడు. రాముడు మ‌త్తుకు బానిస కానే కాడు. మ‌గువ‌కు అస‌లే చ‌లించిపోడు. కానీ ఇలాంటి అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న ఒక ప్ర‌ముఖ హీరో ఇప్పుడు శ్రీ‌రాముడిగా న‌టించ‌డంపైనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌జ‌లు.

ఇటీవ‌ల ముఖేష్ అంబానీ క్రూయిజ్ షిప్ పార్టీకి అటెండ‌యిన ర‌ణ‌బీర్ క‌పూర్ మందు గ్లాసుతో కెమెరాకు చిక్క‌డంతో దానిని ఒక నెటిజ‌న్ సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసి ప‌రువు తీసాడు. ఇత‌డేనా శ్రీ‌రాముడిగా న‌టించేది? ఇందుకు అర్హుడేనా? అని దీనిని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు ``మా శ్రీ‌రాముడు మందు ముట్ట‌డు!`` అంటూ చేసిన ప్ర‌చారం అంతా ఉత్తుత్తే. అది కేవ‌లం పీఆర్ స్టంట్ మాత్ర‌మేనంటూ స‌ద‌రు హీరోగారిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజ‌నులు.

నితేష్ తివారీ `రామాయణం`లో శ్రీరాముని పాత్రను పోషిస్తున్న రణబీర్ కపూర్ మద్యం, ధూమపానం, మాంసాహారాన్ని విడిచిపెట్టాడ‌నేది గ‌తంలో వ‌చ్చిన ఓ ప్ర‌క‌ట‌న సారాంశం. కానీ అదంతా అబ‌ద్ధం అని ఇప్పుడు నిరూప‌ణ అయింది. అత‌డు కంట్రోల్ లో లేడు. ఆల్క‌హాల్ సేవిస్తూ దొరికిపోయాడు! అంటూ క్రూయిజ్ షిప్ పార్టీ నుంచి ఒక ఫోటోని వైర‌ల్ చేస్తున్నారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇటీవ‌ల ఇట‌లీలోని క్రూయిజ్ షిప్ లో అత్యంత వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విహారయాత్రలో రణబీర్ కెమెరాల‌కు చిక్కాడు.

ఈ పార్టీలో ర‌ణ్‌బీర్ సుహానా ఖాన్‌తో మాట్లాడుతున్నాడు.. ఆ ఇద్ద‌రి ప‌క్క‌నే షానాయ కపూర్ కూడా ఉంది. అలాగే ఇదే ఫోటోలో ముఖేష్ అంబానీ- ఆకాష్ అంబానీ క‌లిసి క‌నిపించారు. ఈ ఫోటోగ్రాఫ్ షేర్ అవుతున్న క్ర‌మంలో ర‌ణ‌బీర్ మందు మాన‌లేడ‌ని, మాంసాహారాన్ని విడిచిపెట్ట‌డ‌ని నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు. అత‌డు గొడ్డు మాంసం మానేయ‌లేడంటూ ఒక అభిమాని తీవ్రంగా వ్యాఖ్యానించాడు. అది జీడిపప్పు రసం అని పీఆర్ ద్వారా కథనాలు రాబోతున్నాయి అని ఒక నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా.. అతను విస్కీ గ్లాస్ నుండి టీ తాగుతున్నాడని PR చెబుతుంది అంటూ మ‌రొక‌రు సెటైర్ వేసారు..