భార్య సినిమాలో భర్త విలన్! అప్పుడతడు హీరోనా?
రాక్ స్టార్ రణబీర్ కపూర్ నటుడిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో `రామాయణం`లో నటిస్తున్నాడు.
By: Tupaki Desk | 26 Aug 2024 6:35 AM GMTరాక్ స్టార్ రణబీర్ కపూర్ నటుడిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో `రామాయణం`లో నటిస్తున్నాడు. ఇప్పటికే లీకైన రాముడి లుక్ లో రణబీర్ అదిరిపోయాడు. వెండితెర రాముడు అద్భుతం అంటూ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక సీత పాత్రలో సాయిపల్లవి అంతే ఒదిగిపోయింది. సీత ఆహార్యంలో సాయి పల్లవికి మంచి మార్కులు పడ్డాయి.
ఇలా రీల్ సీతా-రాములు ఎంతో అందంగా హైలైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమా అనంతరం రణబీర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మరో సినిమాకి ఇప్పటి నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్ట్ లాక్ అయింది. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో రణబీర్ కపూర్ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హీరోయిన్ గా అలియాభట్ నటిస్తోంది.
ఈ నేపథ్యంలో హీరో పాత్ర ఎవరు? అన్నది కీలకంగా మారింది. అయితే ఇదే సినిమాలో విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నట్లు తాజాగా అందుతోన్న సమాచారం. అదే జరిగితే హీరో బాధ్యతలు విక్కీకి అప్పగించి...విలన్ పాత్ర రణబీర్ తీసుకున్నాడు? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ చిత్రాలు ఊహకందని విధంగా ఉంటాయి. ఏపాత్ర ఎలా ఉంటుందన్నది ఏమాత్రం గెస్ చేయలేనిది.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలో రణబీర్ ని దర్శకుడు విలన్ గా నే భావిస్తున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారుట. రణబీర్...విక్కీ కౌశల్ నుంచి అక్టోబర్ నుంచే షూట్ లో జాయిన్ అవుతారని, అలియా మాత్రం డిసెంబర్ నుంచి హాజరవుతుందని సమాచారం.