సైలెంట్ గా ట్విస్ట్ ఇచ్చిన రామాయణం!
రణబీర్ కపూర్..సాయి పల్లవి...యశ్ ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వంలో `రామాయణం` ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 April 2024 7:57 AM GMTరణబీర్ కపూర్..సాయి పల్లవి...యశ్ ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వంలో `రామాయణం` ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్ సంచలనంగా మారింది. అన్ని పరిశ్రమల్లోనూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుమ్రోగిపోయింది. రాముడిగా రణబీర్..సీత గా సాయి పల్లవి...రావణుడిగా యశ్ నటించడంతో అంచనాలు ఆకాశన్నంటడం మొదలైంది. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని కోట్లాది మంది ప్రేక్షకాభి మానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయోధ్యలో బాల రాముడు వెలసిన సమయంలో సినిమా రూపుదిద్దుకోవడంతో ఆసక్తి రెట్టింపు అయింది. ఇంత బజ్ ఉన్న సినిమాని చిత్ర యూనిట్ ఇంత సింపుల్ గా లాంచింగ్ ప్లాన్ చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. అవును ఎలాంటి హడావుడి లేకుండా నిన్నటి రోజున ముంబైలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభోత్సవం జరిగింది. అయితే భారీ జనసంద్రంలో ఈసినిమా చిత్రీకరణ ప్రారంభమవ్వడం మాత్రం ఆశ్చర్యకరం. మీడియాకి ఎలాంటి లీక్ లేకుండా సైలెంట్ గా ఇలా సర్ ప్రైజ్ చేసారు.
తొలి సన్నివేశానికి భారీజనం అసవరం పడటంతో కావాల్సిన అంతమందిని స్పాట్ కి తరలించి షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఏప్రిల్ 17 శ్రీరామనవమి సందర్భంగా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోజు సినిమా నుంచి సంథింగ్ స్పెషల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రాముడి.. సీత..రావణుడి లుక్ని ఆరోజున రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందులో భాగంగానే ఇలా సడెన్ గా షూటింగ్ ప్రారంభిచారా? అన్నది కొందరి సందేహం.
ఏది ఏమైనా రామాయణం ప్రారంభమవ్వడంతో సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకాభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక రాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ ప్రత్యేకంగా సన్నదమైన సంగతి తెలిసిందే. సినిమా పూర్తయ్యేవరకూ ఆల్కాహాల్ జోలికి వెళ్లనని...శ్రీరాముడిలాగే ఉంటానని ప్రామిస్ చేసాడు. అలాగే సీత పాత్ర కోసం సాయి పల్లవి సన్నధమవుతుంది. సీత ఆహార్యం కోసం తాను చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసింది. హిందీ కూడా నేర్చుకుంది. రావణుడి పాత్ర కోసం యశ్ అలాగే సన్నధం అవుతున్నాడు.