Begin typing your search above and press return to search.

రణబీర్ క్షమాపణలు- మరి సందీప్ ఏమంటారో?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ గత ఏడాది రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 July 2024 10:07 AM GMT
రణబీర్ క్షమాపణలు- మరి సందీప్ ఏమంటారో?
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ గత ఏడాది రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాక్సాపీస్ వద్ద ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. అంతకన్నా ఎక్కువ విమర్శలను ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమాపై పలువురు సాధారణ సినీ ప్రియులతో పాటు అనేక మంది సెలబ్రిటీలు విమర్శలు గుప్పించారు. హింస ఎక్కువగా ఉందని, పలు సీన్స్ లో మహిళలను తక్కువగా చూపించారని ఆరోపించారు.

అయితే తన సినిమాపై వచ్చిన విమర్శలపై డైరెక్టర్ సందీప్ వంగా అనేక సార్లు స్పందించారు. పలువురికి గట్టి కౌంటర్లు ఇచ్చారు. మిగతా డైరెక్టర్లలో ఎవరైనా ఆ సినిమా తీసి ఉంటే ఎలా ఉండేదో కానీ.. సందీప్ అస్సలు తగ్గలేదు. తనదైన శైలిలో రివర్స్ ఆన్సర్ ఇచ్చారు. రీసెంట్ గా యానిమల్ పై వచ్చిన విమర్శల పట్ల హీరో రణబీర్ కపూర్ స్పందించిన విషయం తెలిసిందే. తండ్రీకొడుకుల సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీతో ఆయన మంచి హిట్ ను అందుకున్నారు.

రణబీర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా యానిమల్ నిలిచింది. అయితే ఆ సినిమాపై విమర్శలను తాను అంగీకరించనని తెలిపారు రణబీర్. సినిమాను కేవలం ఓ ఎంటర్టైనర్ గా మాత్రమే చూడాలన్న ఉద్దేశంతో తీశామని చెప్పారు. కానీ పూర్తిగా తప్పుదోవ పట్టించారని అన్నారు. తాను ఈ సినిమా చేయాల్సింది కాదని, నిరాశపరిచావని చాలా మంది తనతో అన్నట్లు చెప్పారు. వాళ్లందరికీ సైలెంట్ గా క్షమాపణ చెప్పి మళ్లీ ఇలాంటిది జరగదని చెప్పానని తెలిపారు.

ఇప్పుడు రణబీర్ కామెంట్స్ కొద్దిగంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిఖిల్ కామత్ పాడ్‌ కాస్ట్ షోలో రణబీర్ మాట్లాడిన బిట్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు నెటిజన్లు మరో విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకు యానిమల్ పై విమర్శలు చేసిన వారికి కౌంటర్లు ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు రణబీర్ కామెంట్స్ పై ఎలా స్పందిస్తారోనని అంటున్నారు. సందీప్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఆసక్తికరంగా ఉందని చెబుతున్నారు.

అయితే యానిమల్ మూవీపై వచ్చిన విమర్శలను అంగీకరించనని చెప్పిన రణబీర్.. తాను క్షమాపణలు చెప్పినట్లు మాత్రం వెల్లడించారు. సోషల్ మీడియా వల్ల అంతా జరిగిందని తెలిపారు. స్త్రీలకు వ్యతిరేకంగా తీసిన సినిమాగా ముద్ర వేశారని ఆరోపించారు. తనకు యానిమల్ లాంటి సినిమాలే సరైనవని అన్నారు. దీంతో సందీప్ రెడ్డి వంగా.. రణబీర్ కామెంట్స్ పై ఎప్పుడు స్పందిస్తారో.. ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి.