రానా వెనుక ఈ ఐడియా ఎవరిది?
రానా తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియాని హైలైట్ చేసే బాధ్యతలు తీసుకున్నట్లు కనిపిస్తుంది
By: Tupaki Desk | 31 July 2023 6:12 AM GMT'విరాటపర్వం' తర్వాత రానా కొత్త సినిమా 'హిరణ్యకశిప' పట్టాలెక్కుతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఆధ్వర్యంలో 'హిరణ్యకశిప' పనులు వేగవంతమయ్యాయి. సురేష్ బాబు-రానా ఆ బాధ్యతలు ఆయనకే అప్పగించారు. నటుడిగా రానా చేతిలో ప్రాజెక్ట్ ఇదొక్కటే. అయితే నిర్మాతగా మాత్రం రానా చాలా బిజీగా కనిపిస్తున్నాడు. నటుడిగా కంటే నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.
రానా తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియాని హైలైట్ చేసే బాధ్యతలు తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఆ సంస్థలో పలు వెబ్ సిరీస్ లు నిర్మించారు. తాజాగా ఇదే సంస్థపై దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 'కాంత' అనే టైటిల్ తో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. టైటిల్ పోస్టర్ ని కూడా లాంచ్ చేసారు. అయితే ఈ బహుభాషా సినిమా నిర్మాణంలో దుల్కర్ కూడా నిర్మాతగా భాగమయ్యారు.
ఆయన కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదొక డిఫరెంట్ ఎమోషనల్ స్టోరీలా ఉంది. కాంతపై రానా చాలా కాన్పిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఇదే ఏడాది రానా 'పరేషాన్'..'మాయాబజార్ ఫర్ సేల్' లాంటి మరో రెండు సినిమాలు కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. దీంతో రానా ఏడాది ఇప్పటివరకూ నిర్మాతగానే ఎక్కువగా ఫోస్ అవుతున్నాడు. అయితే ఆ సినిమాలేవి రానాని పెద్దగా ప్రోజెక్ట్ చేయలేదు.
కానీ రానా ఏకాగ్రత్త నిర్మాణ రంగంపైనా సీరియస్ గాన ఉన్నారని తెలుస్తోంది. తాతయ్య రామానాయుడు..తండ్రి సురేష్ బాబు వారసత్వాన్ని నిర్మాతగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తూనే సొంత నిర్మాణ సంస్థని స్థాపించి సినిమా వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేయాలి అన్న పట్టుదల కనిపిస్తోంది. ఇటీవలే తమ్ముడు అభిరామ్ కూడా 'అహింస' సినిమాతో హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. నిర్మాణ పరంగా అభిరాం చూసుకుంటాడని అనుకున్నా! అతను మ్యాకప్ వేసుకోవడంతో ఆ బాధ్యత కూడా ఇప్పుడు పెద్దవాడిగా రానా తీసుకోవాల్సి వచ్చింది.