Begin typing your search above and press return to search.

రానా.. ఈ క్యారెక్టర్ చేస్తే మామూలుగా ఉండదు

దగ్గుబాటి హీరో రానా చివరిగా తెలుగులో పూర్తి స్థాయి హీరో విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు

By:  Tupaki Desk   |   8 Jun 2024 2:15 PM GMT
రానా.. ఈ క్యారెక్టర్ చేస్తే మామూలుగా ఉండదు
X

దగ్గుబాటి హీరో రానా చివరిగా తెలుగులో పూర్తి స్థాయి హీరో విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ చిత్రం తర్వాత రానా నాయుడు వెబ్ సిరీస్ ని బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి చేశాడు. విరాటపర్వం తర్వాత 1945 అనే మూవీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమాగా వచ్చింది. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చాలా అవాంతరాల తర్వాత రిలీజ్ అయ్యింది.

తరువాత నిఖిల్ స్పై సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్ సినిమాలో కీలక పాత్రలో రానా నటించారు. ఇదిలా ఉంటే నేనే రాజు నేనే మంత్రి సినిమాతో రానాకి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తేజతో మరోసారి జతకట్టారు. రాక్షసరాజా అనే టైటిల్ కూడా ఈ సినిమాకి ఖరారు చేశారు. ఈ ఏడాదిలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

రానా నాయుడు సీజన్ 2 షూటింగ్ ని రానా కంప్లీట్ చేసాడంట. దీంతో తేజ మూవీని త్వరలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. రానా హిందీలో ఓ మూవీలో ప్రతినాయకుడిగా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. రానా హిందీలో ఇప్పటి వరకు ఆరు సినిమాల వరకు చేశారు. చివరిగా హతి మేరీ సాథి అనే చిత్రంలో కనిపించారు.

అరణ్య టైటిల్ తో తెలుగులో కూడా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు హిందీలో షాహిద్ కపూర్ టైటిల్ రోల్ లో తెరకెక్కబోయే ఛత్రపతి శివాజీ మూవీలో రానా నటించబోతున్నాడంట. ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో రానా నటించడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

OMG 2 మూవీతో సక్సెస్ అందుకున్న అమిత్ రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుందంట. పీరియాడిక్ జోనర్ లో హిస్టారికల్ కథాంశంతో సిద్ధం కాబోయే ఈ చిత్రాన్ని దిల్ రాజు, వాకూ ఫిలిమ్స్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందంట. ఈ ఏడాది ఆఖరులో ఛత్రపతి శివాజీ మూవీ థియేటర్స్ లోకి రానుందంట. బాహుబలి సిరీస్ తర్వాత రానా చేయబోయే పీరియాడికల్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇదే కానుంది. అయితే బాహుబలి సినిమా ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కగా. ఛత్రపతి శివాజీ రియల్ హిస్టరీ కథాంశంతో ఉండబోతోంది.