Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ అంటే రానాకు అసూయ దేనికి?

ఫిలిం కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా మునుపెన్నడూ లేని విధంగా నిష్కపటంగా మాట్లాడాడు. నేను కల్కి సెట్స్‌కి వెళ్ళినప్పుడు ఒకరిని చూసి నేను మొదటిసారి అసూయపడ్డాను.

By:  Tupaki Desk   |   21 Oct 2023 7:36 AM GMT
ప్ర‌భాస్ అంటే రానాకు అసూయ దేనికి?
X

సౌత్ ఇండస్ట్రీలో రానా దగ్గుబాటి ఆల్ రౌండ‌ర్ నిపుణ‌త్వం అన్నివేళ‌లా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అత‌డు హీరో.. నిర్మాత‌.. వ‌క్త‌.. హోస్ట్.. ఇలా చాలా పాత్ర‌ల్ని అవ‌లీల‌గా పోషించాడు. ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తిభావంతుల‌ను ఎంక‌రేజ్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటాడు. చాలా సులభంగా వేగంగా అతడు ప‌రిశ్ర‌మ‌లో హీరోగా అల్లుకుపోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. బాహుబ‌లి లాంటి భారీ ఫ్రాంఛైజీలో భ‌ళ్లాల‌దేవ పాత్ర‌లో ప్ర‌భాస్ కి స‌మానంగా న‌టించి మెప్పించాడు. ఆ త‌ర్వాత రానా భారీ పాన్ ఇండియా సినిమాల‌తో కంబ్యాక్ అయ్యేందుకు ప్ర‌య‌త్నాల్ని ఆప‌లేదు. ఇంత‌లోనే రానా నుంచి ఊహించ‌ని ఒక వ్యాఖ్య అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

రానా తన సహనటుడు ప్రభాస్‌పై అసూయతో ఉన్నాన‌ని అన్నాడు. అయితే దానికి సరైన కారణాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. అతడు బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాల్లో న‌టిస్తూ పాన్ ఇండియా రిలీజ్ ల‌తో ఖాన్ ల‌కు ధీటుగా దూసుకెళుతున్నాడు. ప్ర‌భాస్ ఇప్ప‌టికిప్పుడు స‌లార్ - క‌ల్కి లాంటి భారీ చిత్రాల‌తో దూసుకొస్తున్నాడు. మోస్ట్-వెయిటెడ్ చిత్రం కల్కి AD 2898 విడుదలకు సిద్ధమ‌వుతోంది. ఇంత‌లోనే ఇటీవల రానా దగ్గుబాటి 'కల్కి AD 2898' సెట్‌ను సందర్శించాడు. అక్క‌డ ప్ర‌భాస్ సినిమా భారీ స్థాయిని చూసి చాలా అసూయపడ్డాడు.

ఫిలిం కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా మునుపెన్నడూ లేని విధంగా నిష్కపటంగా మాట్లాడాడు. నేను కల్కి సెట్స్‌కి వెళ్ళినప్పుడు ఒకరిని చూసి నేను మొదటిసారి అసూయపడ్డాను. యువ‌కుడిగా ఎదిగే క్ర‌మంలో నాకు విజువల్ ఎఫెక్ట్స్ సినిమా అంటే- 'స్టార్ వార్స్'. నేను అలాంటి సినిమాలు చూడటం ఇష్టపడ్డాను. సరదాగా నాగి (నాగ్ అశ్విన్)కి కూడా ఆ జాన‌ర్ ఇష్టం. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ అభిరుచి ఉంటుంది. ఇది (క‌ల్కి) సైన్స్ ఫిక్షన్ సినిమా... అని తెలిపాడు.

కల్కి AD 2898ని అద్భుతమైన చిత్రంగా అభివర్ణించిన రానా ఇంకా చాలా విష‌యాల‌పై మాట్లాడాడు. నేను సెట్‌లోకి వెళ్లినప్పుడు, 'ష*ట్' అతడు (ప్ర‌భాస్) దీన్ని చేస్తున్నాడు. నేను కలలుగన్న ప్రతిదాన్ని అతడు చేస్తున్నట్లుగా అనిపించింది. నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు నేను అతడితో మాట్లాడలేదు. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. నేను అతడిని పిలిచి ''నాకు నిజంగా అసూయగా ఉంది.. నాకు ఎందుకో తెలియదు'' అని చెప్పాను. ''డ్యూడ్.. మీరు అసూయ ఫీలైన‌ప్పుడే నేను స‌రైఏ పని చేస్తున్నానని నాకు తెలుస్తుంది. ఇది పురాణేతిహాసాల‌ నుండి సైన్స్ ఫిక్షన్ జోడించిన‌ కథ. ఆ చిత్రం గురించి నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఇందులో భారీ తారాగణం ఉన్నారు. ఈ చిత్రానికి ప్రతిదీ అందుబాటులో ఉంది'' అని తెలిపారు.

నిజమే... రానా నిజాయితీ విస్మయానికి గురి చేస్తుంది. ప్ర‌భాస్ పై అత‌డి అభిమానం కూడా ఉత్సాహం క‌లిగిస్తుంది. వాస్త‌వానికి రాజ‌మౌళికి సాధ్య‌మైతే 'బాహుబలి 3'లో ప్రభాస్ - రానా కలిసి న‌టిస్తే చూడటానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు. రానా న‌టించ‌నున్న పాన్ ఇండియా చిత్రం హిర‌ణ్య‌క‌శిప కోసం ఆస‌క్తిగా ఉన్నారు. మునుముందు ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.