Begin typing your search above and press return to search.

చిటికెలో మ్యారేజ్.. రానా ఎంత స్పీడ్ అంటే..

ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్ సినిమాలో రానా ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు.

By:  Tupaki Desk   |   13 Aug 2024 10:46 AM GMT
చిటికెలో మ్యారేజ్.. రానా ఎంత స్పీడ్ అంటే..
X

టాలీవుడ్ లో స్టార్ యాక్టర్ గా పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్న నటుడు రానా దగ్గుబాటి. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు ఇతర స్టార్ హీరోల చిత్రాలలో ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్ సినిమాలో రానా ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు.

దీంతో పాటు తెలుగులో తేజ దర్శకత్వంలో రానా మూవీ స్టార్ట్ చేశారు. అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది తెలియదు. ఇదిలా ఉంటే కమిటీ కుర్రోళ్ళు మూవీ సక్సెస్ సందర్భంగా టీమ్ అందరితో రానా దగ్గుబాటి చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మూవీలో యాక్ట్ చేసిన నటీనటులతో మాట్లాడారు. మూవీ షూటింగ్ అనుభవాలని అడిగి తెలుసుకున్నారు.

మూవీ సక్సెస్ పై టీమ్ అందరిని రానా అభినందించారు. ఇదిలా ఉంటే ఈ చిట్ చాట్ లో ఓ యాక్టర్ రానాని మీ లైఫ్ లో జరిగిన క్రేజీ మూమెంట్ ఏంటి అని అడిగారు. ఇక రానా ఇంటరెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు. కరోనా టైంలో ఇంట్లో ఖాళీగా ఉండలేక చాటింగ్ కోసం హౌస్ పార్టీ యాప్ ని డౌన్ లోడ్ చేసాను.

అందులో చాలా మందిని కలిసే అవకాశం ఉంటుంది. మనం కూడా కొత్తవాళ్లని యాడ్ చేయొచ్చు. అలా చాలా కాలం క్రితం కలిసిన మిహికాతో అందులో కనెక్ట్ అయ్యాను. ఆ తరువాత వారం రోజులకి మా ఇద్దరికి పెళ్లయిపోయింది. యాప్ లో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత డైరెక్ట్ గా పెళ్లి ప్రపోజల్ పెట్టాను. దానికి మిహికా కూడా షాక్ అయ్యింది. ఆలా అడిగేసరికి మిహికా కన్ఫ్యూజ్ అయ్యిందంట.

తరువాత కొద్ది రోజులకి మిహికా ఒప్పుకోవడంతో పెళ్లి జరిగిపోయిందని రానా చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని రానా ఎక్కడా రివీల్ చేయలేదు. చాలా కాలంగా మిహికాతో ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్నారేమో అని అందరూ భావించారు. అయితే హౌస్ పార్టీ యాప్ ద్వారా మిహికాతో పరిచయం పెరిగి పెళ్లి వరకు దారితీసిందని రానా చెప్పి అందరిని సర్ప్రైజ్ చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం రానా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.