Begin typing your search above and press return to search.

రానా నాయుడు-2.. అదిరిపోయే అప్డేట్

సీనియర్ హీరో వెంకటేష్, టాలీవుడ్ హల్క్ రానా మెయిన్ లీడ్స్ లో రానా నాయుడు వెబ్ సిరీస్ వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 July 2024 7:38 AM GMT
రానా నాయుడు-2.. అదిరిపోయే అప్డేట్
X

సీనియర్ హీరో వెంకటేష్, టాలీవుడ్ హల్క్ రానా మెయిన్ లీడ్స్ లో రానా నాయుడు వెబ్ సిరీస్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఆ వెబ్ సిరీస్ ఫుల్ పాపులర్ అయింది. అత్యధిక వ్యూస్‌ తో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. అదే సమయంలో వివాదాల్లో కూడా నిలిచింది. వెంకటేష్, రానా బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ చేయడంతో కొందరు తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు.

అయితే వెబ్ సిరీస్ పై ఎలాంటి కామెంట్లు వచ్చినా వాటిని పట్టించుకోకుండా నెట్ ఫ్లిక్స్ రానా నాయుడు సీక్వెల్ ను అనౌన్స్ చేసింది. తాజాగా రానా నాయుడు -2 అప్డేట్ ను షేర్ చేసింది. షూటింగ్ మొదలుపెట్టినట్లు ప్రకటించింది. షూటింగ్ సెట్స్ ను నుంచి ఓ చిన్న వీడియో క్లిప్ ను రిలీజ్ చేసింది. దీంతో త్వరలోనే రానా నాయుడు -2 సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అర్థమవుతోంది.

ఇక మేకర్స్ విడుదల చేసిన వీడియోలో రానా, వెంకటేష్ మధ్య యాక్షన్‌ సీన్స్ షూటింగ్ జరుగుతున్నట్లు చూపించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా క‌నిపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెకండ్ సిరీస్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నట్లు తెలుస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రానా నాయుడు 2 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు.

అమెరికన్ టీవీ సిరీస్‌ రే డొనోవన్‌ కు రీమేక్‌ గా రానా నాయుడు వెబ్ సిరీస్ రూపొందిన విషయం తెలిసిందే. అందుకోసం కెరీర్ లో తొలిసారి రానా, వెంకటేష్ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. తండ్రీ కొడుకులుగా కనిపించారు. ఈ సిరీస్ లో యాక్టింగ్ కు గాను ఇటీవల రానా ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నారు. ఎన్నో విమర్శలు వచ్చినా.. సిరీస్ మాత్రం రికార్డు క్రియేట్ చేసింది. గ్లోబల్‌ స్థాయిలో హైయెస్ట్ వ్యూస్ తో టాప్ లో నిలిచింది.

అయితే సీజన్-2 గురించి నెట్ ఫ్లిక్స్ టీమ్ ఇటీవల మాట్లాడింది. ఫస్ట్ సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని సీజన్-2 ను తీసుకొస్తామని తెలిపింది. ఎన్నో ట్విస్టులు ఉంటాయని చెప్పింది. మరింత ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో రానా నాయుడు సిరీస్ హేటర్స్ సంగతి పక్కన పెడితే.. లవర్స్ మాత్రం మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి సీజన్-2 ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.