హిరణ్యకశిప దర్శకుడు అతడే.. రెండోసారి క్లారిటీ!
ఏది ఏమైనా ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ ఈ చిత్రానికి రచయితగా పని చేస్తున్నారని దగ్గుబాటి రానా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
By: Tupaki Desk | 4 Sep 2023 5:33 PM GMTటాలీవుడ్ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ చాలా కాలంగా హిరణ్యకశిప సినిమా కోసం కథను రెడీ చేస్తున్నారని, సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా రూపొందనుందని కథనాలొచ్చాయి. కానీ అనూహ్యంగా కామిక్ కాన్ ఈవెంట్లో దగ్గుబాటి రానా ఈ సినిమాకి రచయితగా త్రివిక్రమ్ పని చేస్తున్నారని వెల్లడించారు. దీంతో గుణశేఖర్ ని పక్కన పెట్టి త్రివిక్రమ్ ని బరిలోకి దించడంపై చాలా చర్చ సాగింది. సురేష్ ప్రొడక్షన్ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ ని పక్కన పెట్టిందన్న ప్రచారం సాగింది. దీనిపై గుణశేఖర్ ఊరుకునేది లేదు! అంటూ సీరియస్ అయ్యారు.
ఏది ఏమైనా ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ ఈ చిత్రానికి రచయితగా పని చేస్తున్నారని దగ్గుబాటి రానా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 1967లో వచ్చిన భక్త ప్రహ్లాద చిత్రానికి మోడ్రన్ వెర్షన్ హిరణ్యకశిప. నేటి సాంకేతికతతో అసాధారణంగా తెరకెక్కిస్తామని రానా తెలిపాడు. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? అన్నదానిపై రానా ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు. ప్రస్తుతానికి ప్రీప్రొడక్షన్ సాగుతోంది. త్రివిక్రమ్ రచయితగా పని చేస్తున్నారని మాత్రం రానా ఇప్పటికి రెండోసారి క్లారిటీనిచ్చారు.
అయితే సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తో ఎలాంటి సమస్యా లేకుండా సురేష్ ప్రొడక్షన్స్ మంతనాలు సాగించిందా లేదా? అన్నదానిపై ఎలాంటి స్పష్ఠతా లేదు. అలాగే గుణశేఖర్ తో దగ్గుబాటి కాంపౌండ్ సినిమా చేస్తుందా లేదా? అన్నదానిపైనా క్లారిటీ రాలేదు. హిరణ్యకశిప కోసం చాలా కాలం పాటు పనిచేసిన గుణశేఖర్ అప్పట్లో సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సురేష్ ప్రొడక్షన్స్ సీనియర్ దర్శకుడితో కాకుండా త్రివిక్రమ్ తో పని మొదలు పెట్టిందని అంతా ఊహిస్తున్నారు. అయితే దీనిపై ఇరువర్గాల నుంచి ఎలాంటి క్లారిటీ అయితే లేదు.