Begin typing your search above and press return to search.

సైలెంట్ గా మొదలెట్టేస్తున్న రానా

రానా దగ్గుబాటి టాలీవుడ్ లో మిగిలిన హీరోలకి భిన్నంగా కెరియర్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు.

By:  Tupaki Desk   |   11 July 2024 4:52 AM GMT
సైలెంట్ గా మొదలెట్టేస్తున్న రానా
X

రానా దగ్గుబాటి టాలీవుడ్ లో మిగిలిన హీరోలకి భిన్నంగా కెరియర్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సెలక్టివ్ గా తనకి సరిపోయే కథలని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాడు. ఓ వైపు నిర్మాతగా లో బడ్జెట్ సినిమాలు చేస్తూ మరో వైపు హీరోగా ప్రయోగాత్మక కథలకి పెద్దపీట వేస్తున్నాడు. అందుకే రానా కెరియర్ లో సక్సెస్ లు తక్కువ అయిన నటుడిగా మాత్రం ఇండియన్ వైడ్ గా మంచి ఇమేజ్ ఉంది. కొంతమంది దర్శకులు అయితే రానా కోసం స్పెషల్ గా కొన్ని క్యారెక్టర్స్ రాసుకుంటారు.

ఇదిలా ఉంటే రానా చివరిగా గత ఏడాది స్పై మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించారు. 2022లో భీమ్లా నాయక్, విరాటపర్వం సినిమాలతో రానా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ నటుడిగా రానాకి మంచి పేరు తీసుకొచ్చాయి. 1945 అనే మూవీ వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. వీటికంటే ముందు అరణ్యఅనే సినిమా వచ్చింది. అది కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఓ విధంగా చూసుకుంటే రానా గత మూడేళ్ళ నుంచి చెప్పుకోదగ్గ సక్సెస్ లు అందుకోలేదు.

వీటి తర్వాత డైరెక్ట్ హీరోగా రానా ఇప్పటి వరకు ఎలాంటి సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న వేట్టయాన్ సినిమాలో కీలక పాత్రలో రానా నటించారు. అలాగే తేజ దర్శకత్వంలో రాక్షసరాజు అనే మూవీని ఎనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా గురించి తరువాత ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా రానా కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కిషోర్ అనే యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో ఒకే చెప్పాడంట.

బాహుబలి ఫేమ్ ఆర్కా మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఖరారైందంట. త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ 2 తర్వాత విక్రమ్ కి జోడీగా కోబ్రా మూవీలో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. తెలుగులోకి సిద్ధూ జొన్నలగడ్డకి జోడీగా తెలుసుకదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇది లైన్ లో ఉండగానే ఇప్పుడు రానాకి జోడీగా ఖరారైందంట. అయితే ఈ సినిమా కథ ఏంటి, ఏ జోనర్ లో తెరకెక్కబోతోంది అనే విషయాలు ఇంకా పూర్తిగా బయటకి రాలేదు. ఇప్పటికే మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయిందట. త్వరలో మూవీ గురించి పూర్తి సమాచారం బయటకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానా నాయుడు సీజన్ 2ని వెంకటేష్ తో కలిసి రానా చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.