రణబీర్.. డబ్బు వాసనకు లొంగడు జాగ్రత్త..
చూస్తూ ఉంటే ఇప్పటివరకు ఏ బాలీవుడ్ హీరో కూడా అందుకొని బాక్సాఫీస్ రికార్డులను అతను టాలీవుడ్ మార్కెట్లో దక్కించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 26 Nov 2023 2:30 AM GMTరణబీర్ కపూర్ యానిమల్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండియా అన్ని మేజర్ లాంగ్వేజ్ లలో కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ట్రైలర్ కు ముందు ఒక లెక్క, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరొక లెక్క అనే విధంగా క్రేజ్ అయితే పెరిగిపోయింది. చూస్తూ ఉంటే ఇప్పటివరకు ఏ బాలీవుడ్ హీరో కూడా అందుకొని బాక్సాఫీస్ రికార్డులను అతను టాలీవుడ్ మార్కెట్లో దక్కించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు ఇప్పటికే మంచి బిజినెస్ డీల్స్ సెట్ అయ్యాయి. ట్రైలర్ కు ముందే డిల్స్ క్లోజ్ అయ్యాయి కానీ ఒకవేళ ట్రైలర్ తర్వాత బిజినెస్ డీల్స్ మాట్లాడుకుని ఉంటే ఆ లెక్క కూడా మరోలా ఉండేదేమో. ఇక తమిళంలో కూడా ఈ సినిమాకు కాస్త ఎక్కువ స్థాయిలోనే బజ్ అయితే క్రియేట్ అవుతుంది. కానీ తెలుగులో ఉన్నంత హైప్ మాత్రం అక్కడ లేదు అని చెప్పాలి. అందుకు కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రణబీర్ కపూర్ ప్రమోషన్స్ హడావిడి కూడా మొదలుపెట్టేశాడు. మొదట అన్ స్టపబుల్ షో ద్వారానే ప్రమోషన్స్ జోరు పెంచిన రణబీర్ కపూర్ మరింత విభిన్నమైన తరహాలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కోరుకుంటూ అయితే ఇప్పుడు అతనికి తెలుగు మార్కెట్లో వచ్చే డిమాండ్ ఏర్పడడంతో ముందుగానే కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు రణబీర్ కపూర్ డేట్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అలాగే తమిళ ఇండస్ట్రీకి చెందిన కొన్ని నిర్మాణ సంస్థలు కూడా ఈ టాలెంటెడ్ హీరో తో ఒక సినిమాను నిర్మించాలని కోరుకుంటున్నారు. అయితే ఆ విధంగా ఆలోచిస్తున్న నిర్మాణ సంస్థలు కేవలం రణబీర్ అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే.. డేట్స్ దొరుకుతాయి అని ఆలోచనతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ అతను అంత ఈజీగా టెంప్ట్ అయ్యే హీరో మాత్రం కాదు.
ఎందుకంటే రణబీర్ కపూర్ మొదట కంటెంట్ ఉన్న కథతో వస్తేనే, దర్శకుడు నచ్చితేనే.. సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు. అంతే కాకుండా తను చేయబోయే పాత్ర ఎంత కొత్తగా ఉంటుంది అనే విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈ విషయం అతడి గత సినిమాలు చూస్తేనే చాలా ఈజీగా అర్థమవుతుంది.
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల డేట్లు దొరికితే ముందుగా రెమ్యునరేషన్ మాట్లాడుకుని, ఆ తర్వాత కథలు దర్శకులను సెట్ చేసుకుంటున్న నిర్మాతలు కూడా అలాగే రణబీర్ కపూర్ దగ్గర ఏదో ఒక రేటు మాట్లాడుకంటే వెళ్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ అలా వెళితే ఎంతవరకు సరిపోదు. కాస్త మెప్పించే డిఫరెంట్ కథ సెట్ చేసుకున్న తరువాత రణబీర్ డేట్స్ కోసం వెళితే అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
యానిమాల్ హిట్టయితే అలాంటి ఆఫర్స్ అతనికి టాలీవుడ్ నుంచి ఎక్కువగా రావచ్చు. కానీ రణబీర్ కూడా పాన్ ఇండియా మార్కెట్ డోస్ పెరుగుతున్న టైమ్ లో చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. అతన్ని అంతకుమించి అనేలా కథలతో మెప్పించాలి అంటే అంత ఈజీ కాదు. మరి రణబీర్ ను ఆ రూట్లో మెప్పించే మొదటి సౌత్ నిర్మాత ఎవరు అవుతారో చూడాలి.