'బ్రహ్మాస్త్ర 2' ఆగిపోలేదు!
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణబీర్ కపూర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 March 2025 5:00 PM ISTబాలీవుడ్ సూపర్‌స్టార్ రణబీర్ కపూర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు నితీష్ తివారీ `రామాయణం` సినిమాలో నటిస్తూనే, సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ లోను నటిస్తున్నాడు. అతడి లైనప్ లో `బ్రహ్మాస్త్ర 2` కూడా ఉందని తెలుస్తోంది.
నిజానికి బ్రహ్మాస్త్ర రిజల్ట్ ఆశించినంత మెరుగ్గా లేకపోవడం, కాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా ఫ్రాంఛైజీలో సినిమాలు తీయరని అంతా భావించారు. ఇటీవల తన భార్య అలియా భట్ పుట్టినరోజు వేడుకలో మీడియాతో మాట్లాడుతూ రణబీర్ తన చిత్రం బ్రహ్మాస్త్రకు సీక్వెల్ గా `బ్రహ్మాస్త్ర 2` వస్తుందని వ్యాఖ్యానించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. 2022 బ్లాక్‌బస్టర్ బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ సీక్వెల్ కచ్చితంగా తెరకెక్కుతుందని అతడు ధృవీకరించారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రస్తుతం వార్ 2 పై దృష్టి సారించడంతో బ్రహ్మాస్త్ర 2 గురించి ఆలోచించే సమయం లేదు. ప్రస్తుత కమిట్‌మెంట్‌లను ముగించిన తర్వాత బ్రహ్మాస్త్ర 2 కోసం ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభిస్తారని రణబీర్ వెల్లడించారు. త్వరలో ఆసక్తికరమైన ప్రకటనలు వెలువడుతాయని రణబీర్ అన్నారు.
`వార్ 2` విడుదలల తర్వాత `బ్రహ్మాస్త్ర 2` ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభం కానుందని రణబీర్ కపూర్ ధృవీకరించారు. దీంతో బ్రహ్మాస్త్ర 2 ఆగిపోలేదని స్పష్ఠత వచ్చింది. ఈ సీక్వెల్ అయాన్ ముఖర్జీకి డ్రీమ్ ప్రాజెక్ట్. చాలా కాలంగా కలలు గన్న ఈ సినిమాని మొత్తం కథను తెరపైకి తెస్తారని అన్నారు. అధికారిక వివరాలు ప్రకటించలేదు కానీ.. ప్రాజెక్ట్ ఖచ్చితంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రావర్స్ తదుపరి అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులలో ఇది ఉత్సాహాన్ని రేకెత్తించింది. బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ, సెప్టెంబర్ 2022లో విడుదలైంది. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు.