వేగంగా వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తున్న అగ్ర హీరో
స్టార్ హీరో రణబీర్ కపూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని కలలు కంటున్నాడు.
By: Tupaki Desk | 29 Sep 2024 3:00 AM GMTస్టార్ హీరో రణబీర్ కపూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని కలలు కంటున్నాడు. పాన్ ఇండియన్ స్టార్ గా ఎదగాలని తపిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే బ్రహ్మాస్త్ర, యానిమల్ సినిమాలు చేసాడు. అయితే అతడి ప్రయత్నం యానిమల్ తో ఫుల్ ఫిల్ అయింది. ఈ సినిమాకి తెలుగులోను ఆదరణ దక్కింది. రణబీర్ 42వ పుట్టినరోజు (28 సెప్టెంబర్ 2024)ను పురస్కరించుకుని అతడికి అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
రణబీర్ కపూర్ ముంబైలోని తన కొత్తగా పునర్నిర్మించిన కృష్ణ రాజ్ బంగ్లాలో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పార్టీని నిర్వహిస్తున్నారు. అతడి తల్లి నీతూ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్ , ఆకాష్ అంబానీ సహా అతడి కుటుంబం, సన్నిహితులు అక్కడికి వచ్చి వేడుకను ఘనంగా నిర్వహించారు. గత 17 సంవత్సరాలుగా, రణబీర్ కపూర్ సినీ పరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్నాడు. అతడు ప్రసిద్ధ కపూర్ కుటుంబం నుండి వచ్చాడు. రిషీకపూర్ వారసుడిగా లెగసీని ముందుకు నడిపిస్తున్నాడు. అతడి ప్రతిభకు గొప్ప గుర్తింపు దక్కింది. ఇండియా బెస్ట్ నటుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు.
రణబీర్ కపూర్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 365 కోట్లుగా అంచనా ఉంది. అతడి విజయవంతమైన సినీ కెరీర్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో సంపాదించిన ఆస్తి. ప్రతి చిత్రానికి రణబీర్ కపూర్ దాదాపు రూ. 70 కోట్లు వసూలు చేస్తాడు. రామాయణంలో తన పాత్ర కోసం అతను రూ. 75 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలిసింది. అతడు యానిమల్ కోసం తన ఫీజును రూ. 35 కోట్లకు తగ్గించినా కానీ.. ఆ తర్వాత తిరిగి పెంచాడు. సినిమాల ద్వారా అతని సంపాదన అతన్ని బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్‌లలో ఒకరిగా నిలబెట్టింది.
రణబీర్ కపూర్ నటనతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి కూడా చాలా సంపాదిస్తాడు. అతను ఫుడింగ్, షాపింగ్, టెక్నాలజీ రంగంలో ప్రసిద్ధ బ్రాండ్‌లను ఆమోదించాడు. ప్రతి ఎండార్స్‌మెంట్ కోసం దాదాపు రూ. 6 కోట్లు సంపాదిస్తాడు. ఇది అతని సంపదను మరింతగా పెంచుతోంది.
రణబీర్ కపూర్ విలాసవంతమైన కార్లను ఇష్టపడతాడు. గ్యారేజీలో ఆకట్టుకునే కార్లను కలిగి ఉన్నాడు. రీసెంట్ గా రూ.2-2.5 కోట్ల విలువైన లెక్సస్ ఎల్ఎమ్ కారును తన గ్యారేజీలో పెట్టాడు. 5 కోట్లకు పైగా ఖరీదు చేసే బెంట్లీ కాంటినెంటల్ GT అతడి వద్ద ఉంది. అతని సేకరణలోని ఇతర కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (రూ. 3.27 కోట్లు), ఆడి ఎ8 ఎల్ (రూ. 1.71 కోట్లు), మెర్సిడెస్-ఎఎమ్‌జి జి 63 (రూ. 2.28 కోట్లు), ఆడి ఆర్8 (రూ. 2.72 కోట్లు) ఉన్నాయి. అతడి భార్య అలియా భట్ కూడా ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ (రూ. 2.8 కోట్లు), బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ (రూ. 1.8 కోట్లు) వంటి కార్లను కలిగి ఉంది.
రణబీర్ కపూర్ కూడా రియల్ ఎస్టేట్‌లో కొన్ని స్మార్ట్ పెట్టుబడులు పెట్టాడు. ముంబైలోని అతని కొత్తగా పునర్నిర్మించిన కృష్ణ రాజ్ బంగ్లా అతని విలాసవంతమైన ఇళ్లలో ఒకటి. ముంబైలోని బాంద్రాలో అందమైన 4-BHK అపార్ట్‌మెంట్, పూణేలోని ట్రంప్ టవర్స్‌లో రూ. 13 కోట్ల అపార్ట్‌మెంట్‌ను కూడా కలిగి ఉన్నాడు. వివిధ మీడియా నివేదికల ప్రకారం పూణేలోని అతని ఆస్తి అతనికి ఏటా రూ. 48 లక్షల అద్దెను తెస్తోంది. రణబీర్ సినిమా వ్యాపారంలో ఎంత ప్రవీణుడో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అంతే ప్రవీణుడు అని నిరూపణ అయింది. రణబీర్ కపూర్ ఆస్తులలో 35 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. ఇది ముంబలో `వాస్తు` అనే భవనంలోని ఏడవ అంతస్తులో ఉంది. అతడికి ముంబైలో 16 కోట్ల విలువైన మరో అపార్ట్‌మెంట్ ఉంది.
సినిమాలే కాకుండా ఇతర పరిశ్రమల్లో కూడా పెట్టుబడులు పెట్టాడు రణబీర్. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ జట్టు ముంబై సిటీ ఎఫ్‌సిలో అతనికి 35 శాతం వాటా ఉంది. అతడు డ్రోన్‌లను తయారు చేసే టెక్ స్టార్టప్‌లో .. కంపోస్ట్ చేయగల చెత్త సంచులు, పునర్వినియోగ కిచెన్ టవల్స్ వంటి పర్యావరణ అనుకూల గృహ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టాడు. ఈ 42వ బర్త్ డే సందర్భంగా సొంతంగా ఫ్యాషన్ లేబుల్ ని ప్రారంభించాడు. ఏఆర్‌కే అనేది ఈ బ్రాండ్ నేమ్. దీనికోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాడు. అతడి ప్రణాళికల్ని చూస్తుంటే, భారీగా ఆదాయాలు తెచ్చే వ్యాపార సామ్రాజ్యాన్ని అత్యంత వేగంగా విస్తరిస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు.