Begin typing your search above and press return to search.

రణబీర్ రామాయణం.. అంతా కొత్తగానే..

రామాయణంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రతో పాటు పరశురాముడిగా కూడా కనిపించబోతున్నాడంట.

By:  Tupaki Desk   |   10 Sep 2024 5:31 AM GMT
రణబీర్ రామాయణం.. అంతా కొత్తగానే..
X

మన భారతీయ ఇతిహాసం గ్రంథం రామాయణంపై ఎన్ని సినిమాలు, సీరియల్స్ వచ్చిన దానికి ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. చూసిన కథనే అయిన ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూడటానికి ఇష్టపడుతున్నారు. కథని చెప్పే విధానంలో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. అందుకే రామాయణం ఇతిహాసానికి ఎన్ని సార్లు దృశ్యరూపం ఇచ్చిన ప్రేక్షకులు ఆధరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో రామాయణం మూడు భాగాలుగా తెరకెక్కుతోంది.

ఇప్పటికే రామాయణం పార్ట్1 షూటింగ్ కూడా మొదలు పెట్టేశారని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో వీలైనన్ని ఇండియన్ భాషలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. రావణుడిగా యష్ కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ లీక్ అయ్యాయి. రామాయణంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రతో పాటు పరశురాముడిగా కూడా కనిపించబోతున్నాడంట.

ఈ రెండు క్యారెక్టర్స్ మధ్యలో చాలా డిఫరెన్స్ ని నితీష్ తివారి చూపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అలాగే మూవీలో రావణుడితో ఫైట్ చేసే గరుడ పక్షికి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మొదటి పార్ట్ లో సీతారాముల పుట్టుక, వివాహం, వనవాస ఘట్టాలతో పాటు రావణుడి ఎంట్రీ ఉండబోతోందంట. పార్ట్2 లో రావణుడి కథాంశం ఎక్కువగా ఉండబోతోందని బిటౌన్ లో వినిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోందని సమాచారం.

మూవీలో హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవిదుబే కనిపించబోతున్నారు. ముందుగా లక్ష్మణుడి పాత్ర కోసం నవీన్ పొలిశెట్టిని అనుకున్న ఎందుకనో కుదరలేదంట. అలాగే శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. సినిమాలో మేగ్జిమమ్ మెయిన్ క్యారెక్టర్స్ అన్నింటికి స్టార్ క్యాస్టింగ్ ని తీసుకున్నారంట. రామాయణం పార్ట్ 1 2026 ఆరంభంలో రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమాలో నితీష్ తివారి కథని చాలా డీటెయిలింగ్ గా చెప్పబోతున్నారని బిటౌన్ లో చర్చించుకుంటున్నారు.

మధు మంతెన, అల్లు అరవింద్ రామాయణం సిరీస్ ని 500 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ కి సమర్ధవంతంగా ఉపయోగించుకొని విజువల్ స్పెక్టక్యులస్ గా రామాయణం కథని నితీష్ తివారి చెప్పబోతున్నారని తెలుస్తోంది. మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోందంట. ఈ చిత్రంలో సాయి పల్లవికి నేషనల్ వైడ్ క్రేజ్ రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.