Begin typing your search above and press return to search.

ఈ మ్యాజిక్ జరిగితే మామూలుగా ఉండదు..!

ఇదిలా ఉంటే టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రణ్ బీర్ తో సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. రణ్ బీర్ తో పూరీ సినిమానా ఇది జరిగే ఛాన్స్ ఉందా అని అనుకోవచ్చు.

By:  Tupaki Desk   |   17 Feb 2025 7:30 PM GMT
ఈ మ్యాజిక్ జరిగితే మామూలుగా ఉండదు..!
X

యానిమల్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ అంతకుముందు కూడా రణ్ బీర్ హిట్ సినిమాలు చేసినా యానిమల్ సినిమా ఇంపాక్ట్ రాలేదని చెప్పొచ్చు. సందీప్ వంగ రాసుకున్న కథకు రణ్ బీర్ కపూర్ జస్ట్ జీవించేశాడు అంతే.. అందుకే ఆ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. యానిమల్ తర్వాత యానిమల్ పార్క్ అంటూ మరో సినిమా కూడా ఉంటుందని టాక్. రణ్ బీర్ కపూర్ ప్రస్తుతం రామాయణ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రణ్ బీర్ తో సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. రణ్ బీర్ తో పూరీ సినిమానా ఇది జరిగే ఛాన్స్ ఉందా అని అనుకోవచ్చు. టాలీవుడ్ లో ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు పూరీ జగన్నాథ్. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు పూర్తిగా ఫాం కోల్పోయాడు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కినట్టు అనిపించినా ఆ తర్వాత వచ్చిన లైగ్ర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు షాక్ ఇచ్చాయి.

పూరీతో సినిమా అంటే స్టార్స్ అంతా భయపడే పరిస్థితికి వచ్చింది. ఐతే పూరీ ఇప్పుడు ఏకంగా యానిమల్ స్టార్ కి గురి పెట్టాడని టాక్. తాను రాసుకున్న ఒక కథను రణ్ బీర్ కి వినిపించాడట పూరీ. రణ్ బీర్ కూడా కథకు ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. ఐతే సినిమా కన్ఫర్మ్ చేసేందుకు మాత్రం టైం అడిగాడని తెలుస్తుంది. పూరీ జగన్నాథ్ రణ్ బీర్ కపూర్ ఈ కాంబో నిజంగా సెట్ అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు.

తన కం బ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నా ఈసారి పకడ్బందీ ప్లానింగ్ తో కథ సిద్ధం చేసుకున్నాడట పూరీ జగన్నాథ్. అందుకే రణ్ బీర్ కూడా ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. రణ్ బీర్ తోనే కాదు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో కూడా పూరీ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్. ఐతే ఈ రెండు సినిమాల్లో ఏది ఓకే అయినా ఈసారి పూరీ మార్ సినిమా వస్తుందని అంటున్నారు. ఇప్పుడు చూస్తున్న ఆల్ఫా మేల్ క్యారెక్టరైజేషన్ సినిమాలకు అసలు నాంది పలికిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్. అలాంటి సినిమా మరోటి పడితే చాలని పూరీ ఫ్యాన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరి పూరీ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.