Begin typing your search above and press return to search.

ఆలియా నా మొద‌టి భార్య కాదు!

అలాంటి ఓ సంఘ‌ట‌న గురించి బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ రీసెంట్ గా ఓ ఇంట‌ర్యూలో తెలిపాడు.

By:  Tupaki Desk   |   21 March 2025 7:00 PM IST
ఆలియా నా మొద‌టి భార్య కాదు!
X

త‌మ ఫేవ‌రెట్ హీరోహీరోయిన్ల కోసం ఫ్యాన్స్ ఎలాంటి ప‌నులు చేయ‌డానికైనా వెనుకాడ‌రు. కొన్ని సార్లు ఫ్యాన్స్ చేసే ప‌నులు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిస్తే, మ‌రికొంద‌రు చేసే ప‌నులు కామెడీగా కూడా ఉంటాయి. అలాంటి ఓ సంఘ‌ట‌న గురించి బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ రీసెంట్ గా ఓ ఇంట‌ర్యూలో తెలిపాడు.

ర‌ణ్‌బీర్ క‌పూర్ అందం గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాలీవుడ్ లోనే కాదు, మిగిలిన ఇండ‌స్ట్రీల్లో కూడా ఆయ‌న‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ర‌ణ్‌బీర్ కు లేడీ ఫ్యాన్సే ఎక్కువ‌గా ఉంటారు. అయితే గ‌తంలో ర‌ణ్‌బీర్ ను అభిమానించే ఓ లేడీ ఫ్యాన్ చేసిన ప‌నిని ఆయ‌న షేర్ చేసుకున్నాడు.

ర‌ణ్‌బీర్ ను అమితంగా ఇష్ట‌ప‌డే ఒక లేడీ ఫ్యాన్ చేసిన ఫ‌న్నీ విష‌యాన్ని ర‌ణ్‌బీర్ బ‌య‌ట‌పెడుతూ, ఆలియా త‌న మొద‌టి భార్య కాద‌ని, త‌న మొద‌టి భార్య వేరే ఉంద‌ని షాకిచ్చాడు. త‌న‌ను బాగా ఇష్ట‌ప‌డే ఓ అభిమాని, తాను ఊర్లో లేని టైమ్ లో బ్రాహ్మ‌ణుడిని తీసుకొచ్చి త‌న ఇంటి గేట్ ను పెళ్లి చేసుకుంద‌ని ర‌ణ్‌బీర్ తెలిపాడు.

గేట్ కు పువ్వులు, బొట్టు పెట్టి ర‌ణ్‌బీర్ తో నా పెళ్లి అయిపోయింద‌ని వాచ్‌మెన్ తో చెప్పి వెళ్లింద‌ట ర‌ణ్‌బీర్ వీరాభిమాని. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే తాను షాక‌య్యాన‌ని, అందుకే ఆమే నా మొద‌టి భార్య అని, అయితే ఆమెను తాను ఇప్ప‌టివ‌రకు కల‌వ‌లేద‌ని, ఆమెను క‌లిసే రోజు కోసం ఎదురుచూస్తున్న‌ట్టు ర‌ణ్‌బీర్ వెల్ల‌డించాడు.

ఇదే ఇంట‌ర్వ్యూలో త‌న భార్య ఆలియా గురించి కూడా ర‌ణ్‌బీర్ మాట్లాడాడు. ఆలియా లాంటి గొప్ప పార్ట్‌న‌ర్ త‌న‌కు దొర‌క‌డం అదృష్ట‌మ‌ని చెప్పిన ర‌ణ్‌బీర్, ఆమె ఒక అద్భుత‌మ‌న్నాడు. ఆలియాకు కూడా సినిమాల్లోకి రాక ముందు నుంచే ర‌ణ్‌బీర్ అంటే ఎంతో ఇష్టం. రాక్ స్టార్ ఈవెంట్ లో మొద‌టిగా ర‌ణ్‌బీర్- ఆలియాకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత అది స్నేహంగా మారి, ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింది. వీరిద్ద‌రూ 2022లో పెళ్లి చేసుకోగా, వీరికి ఇప్పుడు రాహా అనే కూతురుంది.