Begin typing your search above and press return to search.

పోస్టర్ కూడా రాలేదు.. 130 కోట్లా?

‘యానిమల్’ సినిమాతో రణబీర్ కపూర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉందనే మాట వినిపించింది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 4:16 AM GMT
పోస్టర్ కూడా రాలేదు.. 130 కోట్లా?
X

‘యానిమల్’ సినిమాతో రణబీర్ కపూర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉందనే మాట వినిపించింది. మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ కి తన నటనతో రణబీర్ కపూర్ ప్రాణం పోసాడు. ఆ కారణంగానే యానిమల్ మూవీ అంత పెద్ద హిట్ అయ్యింది. ‘బ్రహ్మాస్త్ర’, ‘యానిమల్’ సినిమాలతో రెండు పాన్ ఇండియా హిట్స్ ని రణబీర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతని నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయనే మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ ‘రామాయణం’ సిరీస్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరో వైపు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ లీడ్ రోల్ లో ‘లవ్ అండ్ వార్’ అనే సినిమా ఎనౌన్స్ అయ్యింది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. సంజయ్ లీల భన్సాలీ ఈ చిత్రాన్ని తన హోమ్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. 200+ కోట్ల బడ్జెట్ తో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు ‘లవ్ అండ్ వార్’ మూవీ డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని టాక్ వస్తోంది. ఏకంగా 130 కోట్లు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ చెల్లించిందని బిటౌన్ లో వినిపిస్తోంది. ఇండియన్ మూవీ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ కావడం జరిగిందంట. నెట్ ఫ్లిక్స్ కి సంజయ్ లీలా భన్సాలీ హీరమండీ లాంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ని అందించారు.

ఆయన సినిమాలకి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. దానికి తోడు రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్ యాక్టర్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సంజయ్ లీల భన్సాలీ ట్రాక్స్ రికార్డ్ కూడా ఈ సినిమాకి భారీగా డిజిటల్ రైట్స్ రావడానికి కారణం అయ్యిందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ని సరిగమ కంపెనీ 50 కోట్లకి కొనుగోలు చేసిందని అంటున్నారు.

శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడైపోతే సినిమా ప్రారంభించడానికి ముందే లవ్ అండ్ వార్ మూవీ బడ్జెట్ మొత్తం రికవరీ అయిపోతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు ఏది ఏమైనా క్రేజ్ పరంగా ఇండియాలో టాప్ దర్శలుల లిస్టులో సంజయ్ లీలా భన్సాలీ ఉన్నాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.