Begin typing your search above and press return to search.

ర‌ణ‌బీర్ ఎక్క‌డ‌? రాముడు లేకుండా రామాయ‌ణ‌మా?

కాల్షీట్ల స‌మస్య కార‌ణంగా ప్ర‌ధాన న‌టుడు లేకుండా సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి వ‌స్తే దాని ప‌ర్య‌వసానం ఆ త‌ర్వాత బ‌య‌ట‌ప‌డుతుంది.

By:  Tupaki Desk   |   11 Feb 2025 3:24 AM GMT
ర‌ణ‌బీర్ ఎక్క‌డ‌? రాముడు లేకుండా రామాయ‌ణ‌మా?
X

కాల్షీట్ల స‌మస్య కార‌ణంగా ప్ర‌ధాన న‌టుడు లేకుండా సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి వ‌స్తే దాని ప‌ర్య‌వసానం ఆ త‌ర్వాత బ‌య‌ట‌ప‌డుతుంది. పాత్ర‌లు, పాత్ర‌ధారుల‌తో స‌రైన సింక్ లేకుండా లీడ్ పాత్ర‌ధారి ప‌ని చేయ‌డం స‌రి కాదు. ఇప్పుడు నితీష్ తివారీ 'రామాయ‌ణం' అదే విధంగా తెర‌కెక్కుతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ర‌ణ‌బీర్ క‌పూర్ ప్ర‌స్తుతం `ల‌వ్ అండ్ వార్` షెడ్యూల్ లో బిజీగా ఉండ‌టంతో, అత‌డు నితీష్ జీ `రామాయ‌ణం` కోసం కాల్షీట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దీంతో అత‌డు లేకుండానే డూప్ ని ఉప‌యోగించి కొన్ని స‌న్నివేశాల‌ను నితీష్ తెర‌కెక్కిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక భారీ వీఎఫ్ ఎక్స్ తో రూపొందించ‌నున్న రామాయ‌ణం చిత్రం ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం. దీని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం నితీష్ తివారీ చాలా ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం మొద‌టి భాగం ప‌ని మాత్ర‌మే పూర్త‌వుతుంది. రెండవ భాగం పూర్తి కావాల్సి ఉంది. జూన్ నాటికి రణబీర్ రామాయ‌ణం షెడ్యూల్ లోకి జాయిన్ అవుతార‌ని తెలిసింది.

రామాయ‌ణంలో శ్రీ‌రాముడిగా న‌టిస్తున్న ర‌ణ‌బీర్ అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఈ భ‌క్తిర‌స చిత్రంలో న‌టించాల్సి ఉంటుంది. త‌న పాత్ర‌పై అంత‌గా ఆస‌క్తి లేదు! అన్న‌ట్టుగా దూరం దూరంగా ఉండిపోవ‌డం స‌రికాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సీనియ‌ర్ న‌టుడు, శ‌క్తిమాన్ పాత్ర‌ధారి ముఖేష్ ఖ‌న్నా సైతం ర‌ణ‌బీర్ శ్రీ‌రాముడి పాత్ర‌కు స‌రిపోడ‌ని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు ప‌రిస్థితులు అనుకూలంగా లేని స‌మ‌యంలో ర‌ణ‌బీర్ జాగ్ర‌త్త‌గా ఉంటాడేమో చూడాలి.