భర్త ముందే భార్యతో ఎఫైర్ గురించి అడిగిన కరణ్!
కరణ్ జోహార్ `కాఫీ విత్ కరణ్` షోలో ప్రముఖ యువహీరో చిరాకు పరాకులు కొన్నాళ్ల క్రితం సంచలనమయ్యాయి.
By: Tupaki Desk | 2 Oct 2023 3:30 AM GMTకరణ్ జోహార్ `కాఫీ విత్ కరణ్` షోలో ప్రముఖ యువహీరో చిరాకు పరాకులు కొన్నాళ్ల క్రితం సంచలనమయ్యాయి. అయితే అంతగా చికాకు పెట్టే ప్రశ్న ఏం అడిగాడు? అంటే కాస్త వివరాల్లోకి వెళ్లాలి. కరణ్ జోహార్ తన షోలో ఎందరో సెలబ్రిటీలను విచిత్రమైన ప్రశ్నలతో వ్యక్తిగత అంశాల్ని టచ్ చేస్తూ చికాకు పెడతారన్న సంగతి తెలిసిందే. అతడి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు చాలామంది యువనటీనటులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గాళ్ ఫ్రెండ్ లేదా బోయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ బెడ్ రూమ్ విషయాలను కూడా నిస్సిగ్గుగా ప్రశ్నించే కరణ్ ఒకానొక ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ ని పదే పదే చికాకు పెట్టాడు. అది కూడా తన మాజీ గాళ్ ఫ్రెండ్ దీపిక పదుకొనే గురించి అడిగేస్తూ విసిగించాడు. ఆ సమయంలో రణబీర్ తో పాటు ఈ షోలో రణవీర్ కూడా ఉన్నాడు. అతడి ఎమోషన్ అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే రణ్‌బీర్ కపూర్ ఎందుకు చిరాకు పడ్డాడో, రణ్ వీర్ ఎమోషన్ ఎలా డిఫరెంట్ గా మారిందో చూపించే త్రోబ్యక్ వీడియో ఒకటి ఇటీవల అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో KWK షో ఒకానొక ఎపిసోడ్‌లో రణబీర్ - రణవీర్ సింగ్ ఉన్నారు. షోలో KJo దీపికా పదుకొణెతో ఉన్న సంబంధం గురించి రణబీర్ ని కరణ్ నిలదీసే ప్రయత్నం చేసారు. అయితే రణబీర్ స్పష్టంగా కరణ్ జోహార్ ప్రశ్నతో కలత చెందాడు. మా మధ్య ఏమీ లేదని గట్టిగా ప్రతిస్పందించాడు. వారిద్దరూ సంతోషంగా ముందుకు సాగారు కానీ..! కరణ్ జోహార్ ప్రశ్నకు రణ్ వీర్ చాలా ఇబ్బంది పడ్డాడని ఆ వీడియో చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇక ఆ సమయంలో వాస్తవంగా దీపికతో రిలేషన్‌షిప్‌లో ఉన్న రణ్‌వీర్, షూస్‌ని తీసేసి కరణ్ వైపు విసిరేట్టు పరాచికం ఆడటం కనిపించింది.
తన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ నిరంతరం KJO షో `కాఫీ విత్ కరణ్`కు ఎందుకు వెళతాడు అన్నది ప్రస్థావించారు. అయితే దానికి సమాధానంగా రణబీర్ ఏమన్నారంటే.. నన్ను ఈ సీజన్‌లోకి బలవంతంగా లాగారని అన్నాడు. ఈ వీడియో కరణ్ జోహార్‌కి అలవాటైన ట్రోలింగ్‌ను తెచ్చిపెట్టింది. అయితే కరణ్‌తో మాత్రమే ఈ విధంగా మాట్లాడగలిగే ఏకైక స్టార్ కిడ్ అతనే అని నెటిజన్లు రణబీర్‌ను అభినందిస్తున్నారు. కరణ్ జోహార్ గాసిప్ ప్రశ్నలు యువతరానికి కిక్కిస్తాయని కూడా నెటిజనులు వ్యాఖ్యానించడం కనిపించింది.
కెరీర్ ఆరంభంలోనే రణబీర్ - దీపిక పదుకొనే ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు డేటింగ్ కొనసాగింది. కానీ ఆ తర్వాత రణబీర్ కత్రినతో ప్రేమలో పడటంతో దీపిక సైడ్ అయిపోయింది. ఆ తర్వాత దీపికతో రణ్ వీర్ సింగ్ డేటింగ్ ప్రారంభించాడు. కరణ్ జోహార్ షోలో రణ బీర్ మాట్లాడుతూ .. మామధ్య పదేళ్లు పూర్తయింది. నాటి సంగతులన్నీ కాలంతో పాటే గతించాయి అని రణ్ వీర్ ముందే కరణ్ తో అన్నాడు. ఇక రియల్ లైఫ్ లో రణ్ వీర్ దీపికను పెళ్లాడి సెటిలవ్వగా, రణబీర్ మాత్రం కత్రినకు టాటా చెప్పి, చివరికి ఆలియా భట్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.