రోలెక్స్.. అంత లేదు రణబీర్?
ఎందుకంటే ఈ సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వస్తుందో అదే తరహాలో మరొకవైపు నుంచి డివైడ్ టాక్ కూడా వస్తోంది
By: Tupaki Desk | 2 Dec 2023 4:57 PM GMTయానిమాల్ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వాతావరణం చూస్తేనే అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ సినిమా మొదటి రోజే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. ఇక రెండో రోజు నుంచి కలెక్షన్లు ఏవిధంగా ఉంటాయి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది.
ఎందుకంటే ఈ సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వస్తుందో అదే తరహాలో మరొకవైపు నుంచి డివైడ్ టాక్ కూడా వస్తోంది. అతిగా క్రూరత్వం చూపిస్తూ కొన్ని సన్నివేశాల్లో చిరాకు తెప్పించాయి అనే విధంగా కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ రణబీర్ మాత్రం ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు అనే గుర్తింపును అయితే అందుకుంటూ ఉన్నాడు.
కేవలం హిందీలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ అయితే ఏర్పడుతోంది. అయితే సినిమా చివరలో టైటిల్ క్రెడిట్స్ టైమ్ లో ఊహించిన విధంగా రణబీర్ మరొక పాత్రలో దర్శనం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇది సీక్వెల్ గా ఉండబోతుంది అనే దర్శకుడు చెప్పకనే చెప్పేసాడు. అంతేకాకుండా యానిమల్ పార్క్ అంటూ టైటిల్ కూడా ముందుగానే తెలియజేశారు.
అంతా బాగానే ఉంది కానీ అలా చివరలో ఇద్దరు వ్యక్తులను కత్తులతో దాడి చేసి చంపుతూ ఉంటే రోలెక్స్ అని థియేటర్లో కొన్నిచోట్ల అరుపులు కూడా వినిపించాయి. ఆ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది. కొందరు రణబీర్ సెకండ్ రోల్ రోలెక్స్ రేంజ్ లో ఉంది అన్నట్లుగా కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కానీ విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రలో అతిగా వెళ్లకుండా ఇచ్చిన పర్ఫామెన్స్ అయితే చాలా బాగా ఆకట్టుకుంది. ఇక్కడ యానిమల్ సినిమాలో మాత్రం రణబీర్ కపూర్ లిమిట్స్ లేకుండా కత్తులతో ఊచకోత కోసే విధానం కాస్త అతిగా కూడా అనిపిస్తూ ఉంటుంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక విధంగా రోలెక్స్ తో పోల్చడం అనేది అంతగా కరెక్ట్ కాదేమో. నిజానికి రణబీర్ కపూర్ తన పర్ఫామెన్స్ పరంగా అయితే చాలా న్యాయం చేశాడు. ఇక ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే మాత్రం ఎక్కువగా రోలెక్స్ కి ఓట్లు పడుతున్నాయి మరి రాబోయే భవిష్యత్తులో రోలెక్స్ వర్సెస్ యానిమాల్ పార్క్ క్యారెక్టర్స్ ఎంతవరకు క్రేజ్ పెంచుకుంటాయో చూడాలి.