బ్రేకప్‌పై హీరో హ్యాపీ.. దీపికతోనేనా?
ఈ ఎపిసోడ్ లో బ్రేకప్ అయిన హీరో రణబీర్ కపూర్. ఎవరితో అంటే దీపిక పదుకొనేతో అని ఊహాగానాలు సాగిస్తున్నారు
By: Tupaki Desk | 3 Dec 2023 1:49 AM GMTప్రముఖ హీరో తన మాజీ నుంచి విడిపోయినందుకు సంతోషం వ్యక్తం చేసాడు. ఫలానా స్టార్ హీరోయిన్ నుంచి విడిపోయినందుకేనా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పాత ప్రేమను ఇప్పుడు కొత్తగా తవ్వి తీస్తున్నారు!! ఇంతకీ ఈ సన్నివేశం ఎవరి నడుమ? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
ఈ ఎపిసోడ్ లో బ్రేకప్ అయిన హీరో రణబీర్ కపూర్. ఎవరితో అంటే దీపిక పదుకొనేతో అని ఊహాగానాలు సాగిస్తున్నారు. ఇంతలోనే రణబీర్ కపూర్ పాత వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతడు తాను విడిపోవడం గురించి.., మరెన్నో సంతోషకరమైన విషయాల గురించి పేర్కొన్నాడు. అతడి నిష్కపటమైన ఒప్పుకోలును మెచ్చుకోకుండా ఉండలేరు. రణబీర్ కపూర్ పాత వీడియో రకరకాల కారణాలతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఒకప్పుడు రణబీర్ కపూర్ వ్యక్తిగత జీవితం అతడి వృత్తిగత జీవితంతో పోలిస్తే ఎక్కువగా హెడ్ లైన్స్ లో నిలిచింది. B టౌన్‌లోని పాపులర్ కథానాయికలతో ఎఫైర్లు, బ్రేకప్ ల కారణంగా యానిమల్ స్టార్ కాసనోవాగా పాపులరయ్యాడు. రణబీర్ కపూర్ ... కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' షోలో ఆనందంగా కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా నిజాయితీగా మాట్లాడాడు. రణబీర్ నటించిన తాజా చిత్రం యానిమల్ బాక్సాఫీస్ వద్ద వేవ్స్ క్రియేట్ చేస్తోంది. కంటెంట్ పరంగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో రణబీర్ కపూర్ తన జీవితం గురించి నిష్కపటంగా దాపరికం లేకుండా మాట్లాడాడు. అతడు తనను తాను నిషేధించుకున్నాడు. రణబీర్ రాపిడ్ ఫైర్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. తనను హోస్ట్ కరణ్ కొన్ని వివాదాస్పద ప్రశ్నలు అడిగాడు. వాటికి అతడు సంతోషంగా సమాధానమిచ్చాడు. కథానాయికతో బ్రేకప్ గురించి రణబీర్‌ని ప్రశ్నించగా దాని గురించి వివరాలు చెప్పాడు. అయితే ఆ సమయంలో అతడు కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేస్తున్నందున దీపికా పదుకొణె గురించి మాట్లాడుతున్నాడని నెటిజనులు భావిస్తున్నారు.
హీరోయిన్లతో ఆన్‌స్క్రీన్ ముద్దులు పెట్టుకోకపోవడంపై స్పందించమని రణబీర్ కపూర్‌ను అడిగారు. దానికి అతడు స్క్రీన్ కోసం వారిని ముద్దుపెట్టుకుంటానని చెప్పాడు. నిజానికి కపూర్ బోయ్ ఆ సమయంలో కాసనోవా ఇమేజ్‌లో జీవించేవాడు. అతడు కండోమ్‌ను ఉపయోగించడాన్ని కూడా ఆమోదించాడు. దానిని ఎలా ఉపయోగించాలో ఎలా దుర్వినియోగం చేయకూడదో కూడా తెలిపాడు.
వరుస ప్రేమాయణాలకు ముగింపు పలికి, చాలా గ్యాప్ తర్వాత రణబీర్.. ఆలియా భట్‌ను సంతోషంగా వివాహం చేసుకున్నాడు. కుమార్తె రాహా కపూర్‌కు తండ్రిగా గర్విస్తున్నాడు. రణబీర్ నేడు మారిన వ్యక్తి. ఇంతకుముందులా దూకుడు లేదు. పరిహాసం లేదు. పరిణతితో వ్యవహరిస్తున్నాడు. కెరీర్ పైనే ఫోకస్ పెడుతున్నాడు. అన్నట్టు తన బావమరిది మహేష్ భట్ తన బావకు అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రపంచంలోని ఉత్తమ తండ్రి ట్యాగ్‌ను కూడా రణబీర్ గెలుచుకున్నాడు.