Begin typing your search above and press return to search.

యానిమాల్.. రణబీర్ రెమ్యునరేషన్ ఎంతంటే?

యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లోనే ఊహించని స్థాయిలో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   5 Dec 2023 4:38 AM GMT
యానిమాల్.. రణబీర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
X

యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లోనే ఊహించని స్థాయిలో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కేవలం నార్త్ ఇండస్ట్రీలోనే కాకుండా ఈ సినిమాకు సౌత్ ఇండస్ట్రీలో కూడా సాలిడ్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో ప్రత్యేకంగా రణబీర్ కపూర్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడం ఈ సినిమా ఓపెనింగ్స్ కు బాగా కలిసి వచ్చింది.

ఇక తెలుగులో ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన పెట్టిన పెట్టుబడి కూడా రెండు రోజుల్లోనే వెనక్కి వచ్చేసింది. మొత్తానికి రణబీర్ కపూర్ అయితే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ను క్రియేట్ చేసుకుంటున్నాడు.

బ్రహ్మాస్త్ర సినిమాతో సాధ్యం కాలేనిధి ఇప్పుడు యానిమల్ సినిమా మాత్రం చాలా పర్ఫెక్ట్ గా మార్కెట్ వచ్చేలా చేసింది. దీంతో అతని భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా సౌత్ ఇండస్ట్రీలో మంచి బిజినెస్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక యానిమల్ సినిమాకు అసలు రణబీర్ కపూర్ కు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారుతుంది.

అసలైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్ ఒక్కో సినిమాకు 70 నుంచి 75 కోట్ల రేంజ్ లోనే రెమ్యునరేషన్ తీసుకుంటూ వస్తున్నాడు. ఇక అతను యానిమల్ సినిమాకు మాత్రం చాలా తక్కువగా 35 కోట్ల తీసుకున్నాడట. అందుకు కారణం సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడం. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తోపాటు టి సీరిస్ కూడా ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించింది.

అయితే అంత తక్కువ పారితోషకం ఇచ్చినప్పటికీ కూడా రణబీర్ కపూర్ సినిమా సక్సెస్ అయితే లాభాల్లో వాటా అందుకునేలా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు అతనికి అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలోనే లాభం వచ్చేలా ఉంది. మొత్తానికి రన్బీర్ కపూర్ ఈ సినిమాకు రిస్కు తీసుకుని రెమ్యునరేషన్ తక్కువగానే తీసుకున్నాడు.. ఇక అదే అతనికి ఇప్పుడు చాలా లాభదాయకంగా మారుతుంది. రాబోయే రోజుల్లో మాత్రం అతని పారితోషకం 100కోట్ల రేంజ్ లో ఉంటుంది అని అర్థమవుతుంది.