యానిమల్.. మరో హీరో చేసి ఉంటే?
ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో రణ్ బీర్ తన నట విశ్వరూపం చూపించారు
By: Tupaki Desk | 1 Dec 2023 4:09 PM GMTఅర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమా చూసిన ఆడియన్స్ చాలామంది 'యానిమల్' విషయంలో చెప్పే ఒకే ఒక మాట రణబీర్ వన్ మ్యాన్ షో..
ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో రణ్ బీర్ తన నట విశ్వరూపం చూపించారు. తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు చాలానే ఉన్నాయి. కానీ రణబీర్ నటన వాటన్నిటినీ డామినేట్ చేసింది. తండ్రిని అమితంగా ఇష్టపడే కొడుకుగా, ఒక భర్తగా రణబీర్ నటన టాప్ క్లాస్ లో ఉంది. ముఖ్యంగా యాంగర్, ఎమోషనల్ సీన్స్ లో రణబీర్ పలికించిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
బహుశా 'యానిమల్' లో రణబీర్ క్యారెక్టర్ కు అతను తప్ప మరెవ్వరు సూట్ అవ్వరేమో అనేంతలా తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా చూసిన చాలామంది ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ యానిమల్ మూవీలో రణబీర్ కాకుండా మరే హీరో నటించినా ఈ రేంజ్ ఇంపాక్ట్ ఉండేది కాదేమో. ఉదాహరణకి రణబీర్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ను తీసుకున్నా కూడా ఆ పాత్రకు 100% జస్టిఫికేషన్ జరిగేది కాదు. కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయ్యేది.
ఎందుకంటే అప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేసిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా అర్జున్ రెడ్డి లో తన ఆటిట్యూడ్, అగ్రేసివ్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు రణబీర్ అయితే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండను మించి 'యానిమల్'తో నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కాడు. సినిమాలో రణబీర్ త్రీ డిఫరెంట్ షేడ్స్ లో యాక్షన్, ఎమోషన్ తో మెప్పించాడు.
దాంతో టాలీవుడ్ బాలీవుడ్ ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా 'యానిమల్' క్యారెక్టర్ కి రణ్ బీర్ బీర్ తప్ప మరో హీరో సూట్ అవ్వడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రణ్ బీర్ ని మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ లో చూపించడంలో డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ పూర్తిగా సక్సెస్ అయ్యారు. అర్జున్ రెడ్డిలో క్యారెక్టర్ కి కొన్ని లిమిటేషన్స్ పెట్టుకున్న సందీప్ 'యానిమల్' తో వాటన్నిటినీ దాటి మరి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లి రణ్ బీర్ ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసిన విధానాన్ని కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే.