అలియా లిప్స్ పై.. రణ్వీర్ కండిషన్ ఒక్కటే..
తాను షూటింగ్ లేని సమయంలో బయటకు వెళ్లేటప్పుడు లిప్ స్టిక్ వేసుకుంటే నచ్చదు అని, వెంటనే తుడిచేయమని అంటాడని చెప్పింది.
By: Tupaki Desk | 17 Aug 2023 2:30 PM GMTబాలివుడ్ క్యూట్ అండ్ రొమాంటిక్ కపుల్స్ లో అలియాభట్, రణబీర్ ఒకరు. ఈ జంట చాలా కాలం పాటు ప్రేమించుకొని, పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇటీవల ఓ ముద్దులొలికే చిన్నారి కూడా పుట్టడం విశేషం. అలియాతో పెళ్లికి ముందు రణబీర్ చాలా మందితో డేటింగ్ చేశాడు. కానీ, చివరకు అలియాని పెళ్లి చేసుకున్నాడు.
అయితే, బిడ్డ పుట్టిన తర్వాత కూడా అలియా సినిమాలు చేయడం ఆపలేదు. ఇటీవల రాఖీ ఔర్ రాణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అలియా చాలా స్టన్నింగ్ గా కనిపించింది. బిడ్డ పుట్టిన తర్వాత చాలా కొద్ది సమయంలోనే ఆమె మళ్లీ సన్నగా మారిపోవడం విశేషం. ఆ తర్వాత ఆమె ఓ హాలీవుడ్ ప్రాజెక్టు కూడా చేసింది.
అయితే, తాజాగా అలియా తన భర్త రణబీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను లిప్ స్టిక్ వేసుకుంటే రణబీర్ కి నచ్చదు అని ఆమె చెప్పడం విశేషం. తాను షూటింగ్ లేని సమయంలో బయటకు వెళ్లేటప్పుడు లిప్ స్టిక్ వేసుకుంటే నచ్చదు అని, వెంటనే తుడిచేయమని అంటాడని చెప్పింది. తన పెదాలు లిప్ స్టిక్ లేకుండా సహజంగా ఉంటేనే నచ్చుతుందని అందుకే అలా చెబుతాడు అని ఆమె చెప్పారు.
ఇక, అలియా ఇటీవల హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 'హార్ట్ ఆఫ్ స్టోన్' సినిమాతో వెస్ట్రన్ ఆడియన్స్ ను పలకరించింది. అయితే, తాను తన హాలీవుడ్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ ఎందుకు చేయడం లేదు అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి కూడా అలియా క్లారిటీ ఇచ్చింది. తాను ఒక నటిగా SAG-AFTRA సమ్మెకు మద్దతు ఇస్తున్నానని, అందుకే ప్రమోషన్స్ లో పాల్గొనలేదు అని చెప్పింది.
ఇటీవల, దీపికా కూడా కల్కి ఈవెంట్ అమెరికాలో జరిగితే, దానికి హాజరుకాలేదు. ఇప్పుడు అలియా కూడా తన మూవీ ప్రమోషన్స్ లో కనిపించలేదు. ఇక, అలియా తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆమెకు ప్రస్తుతం చాలా మూవీస్ లో ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.