రామాయణం: విలువిద్య శిక్షణతో అన్ని డౌట్లు క్లియర్
రణబీర్ విలువిద్య శిక్షణ కూడా ప్రారంభించాడని తాజాగా రిలీజైన ఫోటోలు చెబుతున్నాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
By: Tupaki Desk | 26 March 2024 3:17 PM GMTనితీష్ తివారీ రామాయణం నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా ప్రచారం ఆగడం లేదు. రణబీర్ కపూర్ ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. అతడు `రామాయణం` కోసం పూర్తి ప్రిపరేషన్ లో ఉన్నాడనేందుకు ఇప్పటివరకూ ఆధారం లేదు. కానీ అతడు శ్రీరాముడి పాత్రలో నటించనున్నాడని పుకార్లు మాత్రమే వినిపించాయి. తాజాగా తన క్యారెక్టర్ కోసం కఠోర శిక్షణ కూడా తీసుకుంటున్నాడనేందుకు ఇప్పటికి ఒక ఆధారం లభించింది.
రణబీర్ విలువిద్య శిక్షణ కూడా ప్రారంభించాడని తాజాగా రిలీజైన ఫోటోలు చెబుతున్నాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆర్కే అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. X హ్యాండిల్‌లోని ఖుషాలి RK అనే అభిమాని పేజీ ఫోటోల సెట్‌ను షేర్ చేసారు. అందులో రణబీర్ కపూర్ ఆర్చరీ కోచ్‌తో కలిసి పోజులిచ్చాడు. రణబీర్ సింపుల్ దుస్తులు ధరించి కనిపించాడు. శనివారం రణబీర్ కపూర్ ఫిట్‌నెస్ కోచ్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తీవ్రమైన జిమ్మింగ్ ఫోటోలను పోస్ట్ చేశాడు. రణబీర్ పూర్తి ఏకాగ్రతతో జిమ్ లో శ్రమిస్తున్నాడు. ఈ వివరాల దృష్ట్యా.. రామాయణంలో రణబీర్ తన పాత్ర కోసం వంద శాతం సిద్ధమవుతున్నాడని స్పష్ఠత వచ్చింది.
రామాయణంలో కెజిఎఫ్ స్టార్ యష్ రావణుడి పాత్రలో నటించనున్నాడని కథనాలొచ్చాయి. హనుమాన్ పాత్ర కోసం సన్నీ డియోల్ ని లాక్ చేసారు. బాబీ డియోల్ - విజయ్ సేతుపతి వరుసగా కుంభకర్ణ - విభాషణ పాత్రల కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కింగ్ దశరథ్ పాత్రకు అమితాబ్ బచ్చన్‌ని ఖరారు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. రామాయణం ఆగిపోయింది అని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ శిక్షణ చూస్తుంటే, అన్ని డౌట్లు క్లియర్ అయ్యాయి. నితీష్ రామాయణం చిత్రాన్ని పట్టుదలగా ముందుకు తీసుకెళుతున్నాడు. ఇది ఆగే ప్రాజెక్ట్ కాదు. మహా అయితే వాయిదా తర్వాత సెట్స్ కి వెళతారు.