ఆ నటితో రొమాన్స్ భార్య సహకారంతోనే!
ఈ విషయంలో భార్య అలియాభట్ తనకెంతటి సహకారం అందించిందో రివీల్ చేసాడు. కొన్ని సన్ని వేశాలు నటించాల్సి వచ్చినప్పుడు చేయాలా? వద్దా?
By: Tupaki Desk | 21 Jan 2024 4:34 AM GMTబాలీవుడ్ సన్నివేశాల్లో రొమాన్స్ అన్నది ఎంతో వాస్తవికంగా ఉంటుంది. సన్నివేశం రక్తికట్టాలంటే రొమాన్స్ కూడా అంతే నేచురల్ గా ఉండాలని సహజంగానే చాలా సన్నివేశాలు షూట్ చేస్తుంటారు. ఇంటిమేట్ సన్నివేశాల విషయంలో మిగతా పరిశ్రమలకి బాలీవుడ్ ఇనిస్పేరేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయంలో అక్కడ సినిమాల నుంచే మిగతా పరిశ్రమలు అప్ డేట్ అయ్యాయి అన్నది వాస్తవం.
అందుకే బాలీవుడ్ లో ఇంటిమేట్ సన్నివేశాలంటే? చాలా లైట్ అనేస్తారంతా. వాటి గురించి పెద్దగా ఎవరూ చర్చించుకోరు కూడా. కానీ ఈ మద్య కాలంలో అంతటి సంచలనమైన సినిమా ఏదైనా ఉంది అంటే అది 'యానిమల్' ఒక్కటే. ఈ సినిమా విషయంలో నటీనటులు ఎంతగా ఇబ్బంది పడ్డారో పబ్లిక్ గానే చెప్పుకొ చ్చారు. హీరోల పాత్ర దగ్గర నుంచి విలన్ పాత్ర వరకూ అంతా సందీప్ రెడ్డిని మెప్పించడం కోసం వ్యక్తిగతంగా తామెంత అసౌకర్యానికి గురయ్యారో? రివీల్ చేసారు.
సందీప్ ప్రతి పాత్రను బలంగా రాయడంతోనే ఇబ్బంది పడ్డారు. ఆ కారణంగానే నటీనటులకు అంత మంచి పేరు వచ్చింది అన్నది అంతే వాస్తవం. ఇక రణబీర్ కపూర్ ఊచకోత సన్నివేశాలు పక్కనబెడితే రష్మిక మందన్న...తృప్తి డిమ్రితో రణబీర్ చేసిన ఇంటిమేట్ సన్నివేశాలు ఎంత గొప్పగా పండాయో తెలి సిందే. రీల్ లైఫ్ లోనూ..రియల్ లైఫ్ లోనూ రొమాంటిక్ ట్యాగ్ ఉన్న ఈ హీరో కూడా అలాంటి సన్నివేశాల్లో నటించాలంటే చాలా ఇబ్బంది పడినట్లు గుర్తు చేసుకున్నాడు.
ఈ విషయంలో భార్య అలియాభట్ తనకెంతటి సహకారం అందించిందో రివీల్ చేసాడు. కొన్ని సన్ని వేశాలు నటించాల్సి వచ్చినప్పుడు చేయాలా? వద్దా? అన్న డైలమాలో ఉన్నప్పుడు.. వ్యక్తిగతంగా తనను తాను మౌల్డ్ చేసుకోలేని సన్నివేశం ఎదురైనప్పుడు అలియాభట్ వెనుకుండి ఎంతో ప్రోత్సహించింది అన్నాడు. ఇది కేవలం సినిమా..అందులో నువ్వో పాత్ర మాత్రమే..నటుడిగా ప్రేక్షకుల్ని..దర్శకుల్ని మెప్పించడమే నటీనటుల బాధ్యత అనే ధైర్యం కల్పించడంతోనే ఇంటిమేట్ సన్నివేశాల్ని సులభంగా చేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఈ విషయంలో రణబీర్ కి..అలియా ఎంతో గొప్ప సహకారం అందించిందన్నది అర్దమవుతుంది. తాను నటి కావడంతోనే ఓ నటుడి పరిస్థితిని...సినిమాని అర్ధం చేసుకుని ప్రోత్స హించింది. ఇలా అంగీకరిం చాలంటే ఎంతో బ్రాడ్ గా ఆలోచించే మనస్తత్వం ఉండాలి. ఈ విషయంలో రణబీర్ చాలా లక్కీ.