'యానిమల్' చేసినందుకు క్షమాపణలు చెప్పాను: రణబీర్
నిఖిల్ కామత్‌తో ఒక ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ 'యానిమల్' విడుదల తర్వాత జరిగిన పరిణామాల గురించి ఓపెనయ్యాడు
By: Tupaki Desk | 27 July 2024 5:09 PM GMTరణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించినా కానీ.. హింసాత్మక, స్త్రీ విద్వేషపూరిత సన్నివేశాలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. తెలుగు ట్యాలెంట్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యానిమల్ పై విమర్శల గురించి చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. చివరకు రణబీర్ అదే విషయంపై ఇప్పటికి ఓపెనయ్యాడు. తన కెరీర్ కి యానిమల్ ఎందుకు ముఖ్యమో వెల్లడించాడు.
నిఖిల్ కామత్‌తో ఒక ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ 'యానిమల్' విడుదల తర్వాత జరిగిన పరిణామాల గురించి ఓపెనయ్యాడు. పరిశ్రమలోని వ్యక్తులు నిరాశకు గురయ్యామని తనతో ఎలా చెప్పారో అతడు వెల్లడించాడు. రణబీర్ మాట్లాడుతూ ''సోషల్ మీడియాల్లో విధ్వంసం కొనసాగింది. వారు మాట్లాడటానికి ఏదైనా అవసరం కాబట్టి ఇది స్త్రీ ద్వేషపూరిత చిత్రం అని విమర్శించారు. అయితే ఇదే దర్శకుడు కబీర్‌సింగ్‌ను తయారు చేశాడని నాకు తెలుసు.. అది కూడా అదే విధంగా విమర్శల్ని ఎదుర్కొంది. అయితే మా శ్రమ తగ్గింది. ఇది ఈ ట్యాగ్‌ని పొందింది కానీ అది నిజం కాదు. అవగాహన ఇలాంటి వాటికి అవసరం కాబట్టి.. సాధారణ ప్రేక్షకులు సినిమా గురించి చాలా ఇష్టంగా మాట్లాడారు'' అని అన్నారు.
మీరు ఈ సినిమా చేయకూడదు.. మీ విషయంలో చాలా నిరాశ చెందాము! అని నాతో ఇండస్ట్రీ వ్యక్తులు చెప్పేవారు. పరిశ్రమకు చెందిన చాలా మంది అదే మాట అన్నారు. నేను నిశ్శబ్దంగా క్షమాపణలు కోరుకున్నాను..''సారీ నేను మరోసారి చేయను'' అన్నాను. ''నేను నిజంగా వారితో ఏకీభవించను.. కానీ నేను నా జీవితంలో ఆ దశలో ఉన్నాను.. నేను ఎవరితోనూ వాదించను. మీకు నా పని నచ్చకపోతే క్షమించండి.. నెక్ట్స్ టైమ్ మరింత కష్టపడి ప్రయత్నిస్తాను'' అని చెబుతానని అన్నారు.
యానిమల్ ఆఫర్ వచ్చినప్పుడు తాను భయపడ్డానని, తెరపై తనకు గుడ్ బోయ్ ఇమేజ్ నుంచి విముక్తి పొందేందుకు ఇది చేయాలనుకున్నానని కూడా రణబీర్ చెప్పాడు. అతడు మాట్లాడుతూ ''నేను ఎప్పుడూ మంచి పాత్రలు చేస్తూ, మంచి సామాజిక సందేశాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రాథమికంగా 'మంచి అబ్బాయి'గా నటించాను. నాకు ఉన్న రొమాంటిక్ ఇమేజ్‌ని నేను ఎప్పటినుంచో అనుసరిస్తున్నాను. కాబట్టి ఇది(యానిమల్ ఆఫర్) చాలా బోల్డ్‌గా అడల్ట్ రేటెడ్ అని నేను కనుగొన్నాను. ప్రేక్షకులు నన్ను ఆదరించరేమోనని భయపడ్డాను. చిత్రం విడుదలై అద్భుత వసూళ్లు సాధించినా కానీ, స్త్రీద్వేషం తప్పుగా భావించిన పెద్ద ప్రేక్షకులు ఉన్నారు.
ఇది మాత్రమే కాదు.. మళ్లీ ఇలాంటి సినిమా చేస్తావా? అని అడిగినప్పుడు రణబీర్ హోస్ట్ సమక్షంలోనే నిరభ్యంతరంగా చేస్తానని చెప్పాడు. ''నేను స్తబ్దుగా ఉన్నాను .. నా కెరీర్‌లో సంతృప్తిని పొందాను. నన్ను చాలా కాలంగా 'నెక్స్ట్ సూపర్ స్టార్' అని పిలిచేవారు- నేను ఈ రోజు సూపర్ స్టార్ ని అని చెప్పడం లేదు.. ఎందుకంటే ఇలాంటి నిరంతర బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉంటే తప్ప మమ్మల్ని సూపర్ స్టార్ అని పిలవలేరు. కాని యానిమల్ సరైన చిత్రం. సరైన సమయం.. మరొక అడుగు వేయడానికి.. ఎందుకంటే నేను అదే స్థితిలో ఫ్లాట్‌లైన్‌లో ఉన్నాను కాబట్టి నా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం కోసం.. మంచి అబ్బాయి నుండి కొన్ని మార్గాల్లో మారడం నాకు చాలా ముఖ్యం.
సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. చాలా కాలంగా పాన్ ఇండియా హిట్ కోసం ఎదురు చూసిన రణబీర్ కి నిజమైన అలాంటి ఒక విజయాన్ని ఇచ్చింది యానిమల్. ఇప్పుడు రణబీర్ కపూర్ నితేష్ తివారీ రామాయణంలో నటిస్తున్నాడు. ఇందులో అతడు 'రాముడు మంచి బాలుడు' పాత్రలోనే నటిస్తున్నాడు. అతడు సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ & వార్'లోను నటిస్తాడు. అలియా భట్, విక్కీ కౌశల్‌లతో కలిసి నటిస్తాడు.