Begin typing your search above and press return to search.

ర‌ణ‌బీర్ రామాయ‌ణం.. బ్లాస్ట్ అయ్యే అప్‌డేట్‌

2024 వేసవిలో రామాయణం సెట్స్ కి వెళ్లడానికి సిద్ధంగా ఉందని ర‌ణ‌బీర్ స్వయంగా చెప్పార‌ని స‌ద‌రు నెటిజ‌న్ పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 6:21 AM GMT
ర‌ణ‌బీర్ రామాయ‌ణం.. బ్లాస్ట్ అయ్యే అప్‌డేట్‌
X

రణబీర్ కపూర్ `యానిమల్` సంచ‌ల‌న విజ‌యాన్ని ఆస్వాధిస్తున్నాడు. ఇంత‌లోనే తదుపరి ప్రాజెక్ట్ - నితేష్ తివారీతో `రామాయణం` గురించి ఆస‌క్తిక‌ర అప్ డేట్ అందింది. త్వరలో ఈ సినిమాని ప్రారంభించే అవకాశం ఉందనేది దీని సారాంశం. ఇటీవల ఒక సోషల్ మీడియా యూజర్ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ర‌ణ‌బీర్ రామాయ‌ణం ప్రారంభోత్స‌వం గురించి ప్ర‌స్థావించాడు. 2024 వేసవిలో రామాయణం సెట్స్ కి వెళ్లడానికి సిద్ధంగా ఉందని ర‌ణ‌బీర్ స్వయంగా చెప్పార‌ని స‌ద‌రు నెటిజ‌న్ పేర్కొన్నారు.


X లో నెటిజ‌న్ ఇటీవల వరుస పోస్ట్‌లను షేర్ చేసారు. తాను విమానాశ్రయంలో రణబీర్ కపూర్‌తో రామాయణం గురించి చర్చించినట్లు అత‌డు పేర్కొన్నాడు. ``ఇమ్మిగ్రేషన్ క్యూలో రణబీర్ కపూర్ కంటే ముందు నిలబడిన అత‌డు #యానిమల్ గురించి.. అతడి తదుపరి క్రేజీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాన‌``ని తెలిపాడు. నేను బొంబాయి ట్రిప్ వెళుతున్నాను.. అత‌డు ఎంత అందమైన వ్యక్తి! అంటూ అత‌డు ర‌ణ‌బీర్ ని పొగిడేసాడు.

రామాయణం 2024 మధ్యలో ప్రారంభమవుతుందని రణబీర్ కపూర్ తనతో చెప్పినట్లు ప్ర‌యాణీకుడు వెల్లడించారు. రామాయ‌ణం వేసవి ప్రారంభంలో చిత్రీక‌ర‌ణ‌కు వెళుతుంద‌ని చెప్పాడు. నేను అంతకు మించి ఏమీ చెప్పకూడదనే విష‌యం నాకు క‌చ్చితంగా తెలియదు. కానీ రామాయ‌ణం తారాగణం చాలా పిచ్చిగా ఉంది… వావ్! బాలీవుడ్ ని 2023 నుండి తదుపరి స్థాయికి తీసుకువెళ్లే ప్ర‌య‌త్న‌మిది... అని వరుస పోస్ట్ ల‌లో స‌ద‌రు నెటిజ‌న్ ఎగ్జ‌యిట్ అవుతూ రాసారు. రామాయణం షూటింగ్ ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభం కానుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజా స‌మాచారంతో ఇప్పుడు కొంత‌ స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది.

నితీష్ తివారీ `రామాయణం`లో లార్డ్ శ్రీ‌రాముని పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీత పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకున్నారు. ఇంతకుముందు సీత పాత్ర కోసం అలియా భట్ తో చర్చలు జరుపగా డేట్స్ సంబంధిత సమస్యల కారణంగా వెనక్కి తగ్గింది. ఈ సినిమాలో కెజిఎఫ్ స్టార్ యష్ రావణుడిగా నటించే అవకాశం ఉంది. అత‌డిపై ఫోటోషూట్ కూడా జ‌రిగింది. ఈ ఏడాది అక్టోబర్‌లో సన్నీడియోల్ హనుమాన్‌గా న‌టించే అవకాశం ఉందని కూడా క‌థ‌నాలొచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.