Begin typing your search above and press return to search.

ఆ న‌టిపైనా అత‌డు అలాంటి దాడి!

`రేణుకాస్వామి నన్ను కూడా అస‌భ్య మెసెజ్ లో ఇబ్బంది పెట్టాడంటూ` మ‌రో క‌న్న‌డ న‌టి చిత్ర‌ల్ రంగ‌స్వామి తాజాగా తెర‌పైకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 7:30 AM GMT
ఆ న‌టిపైనా అత‌డు అలాంటి దాడి!
X

`రేణుకాస్వామి నన్ను కూడా అస‌భ్య మెసెజ్ లో ఇబ్బంది పెట్టాడంటూ` మ‌రో క‌న్న‌డ న‌టి చిత్ర‌ల్ రంగ‌స్వామి తాజాగా తెర‌పైకి వ‌చ్చింది. ఇన్ స్టా గ్రామ్ స్టోరీ లో షేర్ చేసిన వీడియో లో ఆమె మాట్లాడుతూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ` ప్ర‌స్తుతం దేని గురించి చ‌ర్చ జ‌రుగుతుందో అంద‌రికీ తెలిసిందే. ఆ విష‌యంలో అంతా బాధ‌గానే ఉన్నారు. రేణుకాస్వామి కుటుంబానికి ఆ భ‌గ‌వంతుడు ధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నా. ఈ కేసు విష‌యంలో ఎవ‌రికీ స‌పోర్ట్ చేయ‌డం లేదు.

కానీ రేణుకాస్వామి చాలా మంది అమ్మాయిల‌కు అశ్లీల మెసేజ్ లు పంపింది వాస్త‌వం. అత‌డిపై పోలీస్ స్టేష‌న్ లో కేసు కూడా న‌మోదైంది. గౌత‌మ్ అనే పేరుతో నాకు అలాంటి మెసెజ్ లు పంపించాడు. ఆ స్క్రీన్ షాట్లు ఇప్పుడే నేను బ‌య‌ట పెట్ట‌లేను. అందుకే వాటిని పోస్ట్ చేయ‌డం లేదు. దుస్తులు లేకుండా షేర్ చేస్తే నేను బ్లాక్ చేసే దాన్ని. కానీ ఇక్క‌డ ఆశ్చ‌ర్య‌మేంటి? అంటే నా ఇన్ స్టా గ్రామ్ లో బ్లాక్ చేసిన లిస్ట్ లో ఇంత‌కు ముందే ఇత‌డి అకౌంట్ కూడా ఉంది.

చాలా రోజులు సైలెంట్ గానే ఉన్నాను. ఇప్పుడు ప‌రిస్థితి చూసే మాట్లాడుతున్నాను` అని రాసుకొచ్చింది. చిత్ర‌ల్ రంగ‌స్వామి న‌టి. ఆమె మంచి బాడీ బిల్డ‌ర్ కూడా. బిగ్ బాస్ లోనూ పాల్గొంది. మ‌రి తాజాగా చిత్ర‌ల్ తెర‌పైకి తెచ్చిన అంశాల్ని పోలీసులు, కోర్టు ఎంత‌వ‌ర‌కూ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంది అన్న‌ది తెలియాలి. ప‌విత్ర గౌడ్ ని అస‌భ్యంగా వేధించ‌డానే ప్రియుడు ద‌ర్శ‌న్ రేణుకాస్వామిని హ‌త్య చేసిన‌ట్లు తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ద‌ర్శ‌న్, ప‌విత్ర‌, మ‌రికొంత మంది అభియోగాల నేప‌థ్యంలో జ్యూడీడిష‌య‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు. ఇక ద‌ర్శ‌న్ గురించి తెలిసిన వారంతా ఆయ‌న గురించి సానుకూలంగా స్పందించే వారు మ‌రికొంత మంది అయితే వ్య‌తిరేకంగా మాట్లాడేవారు మ‌రికొంత మంది. ద‌ర్శ‌న్ మాన‌సిక స్థితి స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్లే హ‌త్య జ‌రిగి ఉంటుంద‌ని మానసిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.