అతడికి 95 ఏళ్లు వచ్చినా రొమాన్స్ కి రెడీ!
చాలా అరుదుగా బహుముఖ ప్రజ్ఞతో ఆకర్షించే నటీమణులు ఉంటారు. ఇదే కేటగిరీకి చెందుతుంది అందాల రాణి ముఖర్జీ.
By: Tupaki Desk | 1 April 2024 2:45 AM GMTచాలా అరుదుగా బహుముఖ ప్రజ్ఞతో ఆకర్షించే నటీమణులు ఉంటారు. ఇదే కేటగిరీకి చెందుతుంది అందాల రాణి ముఖర్జీ. కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలతో అలరించిన రాణీ బాలీవుడ్ లో బహుముఖ ప్రజ్ఞావంతురాలైన నటీమణులలో ఒకరు. రాణీజీ ఇటీవల 46వ వసంతంలోకి అడుగుపెట్టారు. 90వ దశకం నుండి ఇప్పటి వరకు రాణీ వైవిధ్యమైన పాత్రలను పోషించి గొప్ప ఫాలోవర్స్ ని సంపాదించింది. రాణీ ముఖర్జీ ఎల్లప్పుడూ తనలోని ఉత్తమమైన నటప్రదర్శనను బయటకు తీసుకురావాలని చూసుకుంటుంది. రొమాంటిక్ కామెడీతో అలరించే ప్రతిభ తనకు ఉంది. సాంఘిక నాటకంతో కదిలించగలదు. రాణి అగ్ర నటులందరితో కలిసి పని చేసింది. అయినప్పటికీ షారుఖ్ ఖాన్‌తో తన కెమిస్ట్రీ ప్రత్యేకంగా నిలుస్తుంది.
రాణి ముఖర్జీ - షారూఖ్ ఖాన్ కుచ్ కుచ్ హోతా హై, చల్తే చల్తే , కభీ అల్విదా నా కెహనా వంటి పలు చిత్రాలకు కలిసి పనిచేశారు. ఇద్దరు నటీనటులు ఒకరి గురించి ఒకరు మంచి విషయాలు చెప్పుకుంటారు. వీరిద్దరూ మళ్లీ రొమాంటిక్ మూవీలో నటించాలని వారి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాణి కూడా స్క్రీన్‌పై SRKతో రొమాన్స్ చేయడం ఇష్టపడుతుంది. గతంలో కింగ్ షారూఖ్ గురించి చాలా అందంగా చెప్పింది రాణీ.
ఒక పాత ఇంటర్వ్యూలో రాణి ముఖర్జీ తన వివాహం గురించి ముచ్చటిస్తూ.. తాను షారుఖ్ ఖాన్ ప్రేమకు మూలాన్ని (సోర్స్) వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. 2014లో ఆదిత్య చోప్రా(ఖాన్ ప్రేమకథా చిత్రాలకు రచయిత, దర్శకుడు కూడా)ను రాణీ పెళ్లి చేసుకున్నారు. నా భర్త ఆదిత్య చోప్రా రాసిన ప్రేమకథా చిత్రాల్లో నేను నటించాను. అందుకే నేను SRK ప్రేమకు మూలాన్ని వివాహం చేసుకున్నాను`` అని అన్నారు. రాజ్(షారూఖ్ పాత్ర)ని సృష్టించింది ఆయనే (ఆదిత్య చోప్రా). అతడు పరిశ్రమలో ప్రోటోటైప్ రొమాన్స్‌కు మూలం.. అని రాణీ వర్ణించారు.
అభిమానులు తనను SRKతో మళ్లీ పెద్ద తెరపై చూడాలనుకుంటున్నారని కూడా రాణీజీ అన్నారు. షారూఖ్‌తో రచయితలు తన కోసం అపురూపమైన, పరిణతి చెందిన ప్రేమకథ రాయాలని రాణి ముఖర్జీ ఆకాంక్షించారు. తనకు SRKతో రొమాన్స్ చేయడమంటే చాలా ఇష్టమని, తనకు 80 ఏళ్లు వచ్చే వరకు, అతడికి 95 ఏళ్లు వచ్చే వరకు అలానే కొనసాగిస్తానని రాణి పేర్కొంది. ఒకసారి కపిల్ శర్మ షోలో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు SRK మీద కూడా ప్రేమ ఉందని వెల్లడించింది. రాణి - ఎస్‌ఆర్‌కెలను మళ్లీ అందమైన ప్రేమకథలో చూడాలంటే అది దర్శకరచయితల చేతిలోనే ఉంది ఇప్పటికి.