Begin typing your search above and press return to search.

'కండోమ్ యాడ్స్ కు జాన్వీ బెస్ట్ ఛాయిస్!'

రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తంగం రోల్ లో ఆకట్టుకుంది అమ్మడు.

By:  Tupaki Desk   |   29 Jan 2025 1:37 PM GMT
కండోమ్ యాడ్స్ కు జాన్వీ బెస్ట్ ఛాయిస్!
X

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి వచ్చిన ఆమె.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. వైవిధ్యమైన కంటెంట్ తో మెప్పిస్తుందనే చెప్పాలి. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తంగం రోల్ లో ఆకట్టుకుంది అమ్మడు.

ఇప్పుడు తెలుగులో తన సెకండ్ మూవీ.. స్టార్ హీరో రామ్ చరణ్ తో చేస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో పలు సినిమాలు లైన్ లో పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆమె గురించి మ్యాన్‌ కైండ్ ఫార్మా ఫౌండర్ రాజీవ్ జునేజా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మ్యాన్ కైండ్ సంస్థకు చెందిన కండోమ్స్ మ్యాన్ ఫోర్స్ ను బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్.. కొంత కాలంగా ప్రమోట్ చేస్తున్నారు. అంతకుముందు సన్నీలియోన్ ఉండగా.. కార్తీక్ ఆర్యన్ ను తీసుకున్నారు. అయితే ఆ విషయంపై రాజ్ సమానీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న రాజీవ్ జునేజా.. పలు వ్యాఖ్యలు చేశారు. కండోమ్ విషయంలో పురుషుల సైడ్ చెప్పాలనుకుని కార్తీక్ ను ఎంపిక చేశామని చెప్పారు.

అప్పుడు.. తమ యాడ్స్ కు ఇంకా ఎవరు బాగా సూట్ అవుతున్నారన్న ప్రశ్నకు కండోమ్ కోసమైనా, మరే ఇతర యాడ్ కోసం అయినా జాన్వీ కపూర్ అని అన్నారు. ఆమె పెర్ఫెక్ట్ గా సూటవుతారని తెలిపారు. తన వరకైతే జాన్వీ బెస్ట్ ఛాయిస్ అని పేర్కొన్నారు. మేల్ యాక్టర్ అయితే రణ్ బీర్ కపూర్ అని చెప్పారు. కిల్ మూవీ లక్ష్య పేరు కూడా తెలిపారు.

అయితే తమ సంస్థ రూపొందించిన ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ కిట్ ప్రమోషన్స్ కోసం అనుష్క శర్మ లేదా దీపికా పదుకొణె అయితే బాగుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ దీపికకు తాము సంప్రదించలేదని తెలిపారు. ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వలేమని చెప్పడం గమనార్హం. కండోమ్ యాడ్ అయితే జాన్వీ బాగుంటుంది అన్నారు కానీ, ఎవరూ సంతకం చేయలేదని స్పష్టం చేశారు.

ఇప్పుడు రాజీవ్ జునేజా వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అది కేవలం వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధించిన విషయమని వాదిస్తున్నారు. ప్రస్తుతానికి జాన్వీ కపూర్ లేదా రణబీర్ కపూర్.. రాజీవ్ వ్యాఖ్యలకు స్పందించలేదు. రాబోయే రోజుల్లో ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.