దేవర 2 పైనే అసలు డౌట్.. మళ్ళీ రణ్వీర్ అంటారేంటి?
'దేవర' మొదటి భాగం మంచి వసూళ్లు సాధించినప్పటికీ సినిమా అవుట్‌పుట్ పట్ల ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదనే టాక్ అప్పట్లోనే వినిపించింది.
By: Tupaki Desk | 3 March 2025 2:51 PM IST'దేవర' మొదటి భాగం మంచి వసూళ్లు సాధించినప్పటికీ సినిమా అవుట్‌పుట్ పట్ల ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదనే టాక్ అప్పట్లోనే వినిపించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విషయంలో ప్రధానంగా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, అనిరుధ్ సంగీతం మాత్రమే ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లను మరో లెవల్‌కి తీసుకెళ్లిందన్న అభిప్రాయమే ఎక్కువగా వచ్చింది. ఇక కొరటాల శివ మేకింగ్‌పై, కథా సరళిపై మిశ్రమ స్పందన రావడంతో ‘దేవర 2’ ఉంటుందా లేదా అనే అనుమానాలు అప్పట్నుంచే నెలకొన్నాయి.
కానీ కొరటాల ఈ ప్రాజెక్టుపై ఇంకా పని చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీ బిగ్ బడ్జెట్ మూవీ ‘వార్ 2’ చివరి షెడ్యూల్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పక్కా 1000 కోట్ల మార్కెట్ కలిగిన బొమ్మగా చెప్పుకుంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇంటెన్స్‌గా ఉండబోతుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అయితే ఆ కలెక్షన్స్ డబుల్ అవ్వొచ్చు.
ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా భారీ లెవెల్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది. ఇది హై వోల్టేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని టాక్. ఇలా వరుసగా 1000 కోట్ల బిజినెస్ గల సినిమాలు లైనప్ చేసుకుంటున్న ఎన్టీఆర్‌కి ‘దేవర 2’ కూడా అదే స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇదిలా ఉండగా కొరటాల శివ మాత్రం ‘దేవర 2’ స్క్రిప్ట్‌పై మళ్లీ మళ్లీ పని చేస్తున్నట్లు సమాచారం. మొదటి పార్ట్‌కు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని చూస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
అలాగే ఈసారి మళ్ళీ బాలీవుడ్ మార్కెట్‌ను ఫోకస్ చేయాలని డిసైడ్ అయిన కొరటాల, హిందీ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసేలా కథను ప్లాన్ చేస్తున్నాడట. దీనిలో భాగంగా హిందీ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే విలన్ పాత్రలో ఫస్ట్ పార్ట్ లో సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. ఇక న్యూ రోల్ కోసం త్వరలోనే రణ్వీర్‌తో చర్చలు జరపనున్నారని కూడా టాక్ ఉంది.
అయితే అసలు ‘దేవర 2’ ఉంటుందా లేదా అన్న అనుమానాల మధ్య రణ్వీర్ సింగ్ పాత్ర ఉంటుందని అంటుండడం నమ్మడానికి కొద్దిగా కష్టంగా ఉంది. ఎన్టీఆర్ క్రేజ్ నార్త్‌లో పెరుగుతుండటంతో బాలీవుడ్ నుంచి బడా హీరోలు ఈ సినిమాలో ఉంటే మరింత ప్లస్ అవుతుందని కొరటాల ఆలోచించి ఉండొచ్చు. ఇక మరోవైపు ‘దేవర 2’కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు. కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్‌తో ‘దేవర 2’ ఉంటుందని ఆ మద్యం బలంగా చెప్పుకుంటున్నారు.
కానీ తారక్ లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్ లో కూడా ఆ నమ్మకం కలగడం లేదు. ఏదేమైనా పూర్తిగా ఎన్టీఆర్ చేతుల్లోనే ఉంది. కొరటాల స్క్రిప్ట్ ను అంతకుమించి అనేలా సెట్ చేస్తే తప్ప సెట్స్ పైకి రాకపోవచ్చు. ఇప్పుడు ‘వార్ 2’ & ‘ప్రశాంత్ నీల్ మూవీ’ పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో స్పష్టత ఇవ్వొచ్చు. కానీ ఇప్పటివరకు ‘దేవర 2’ విషయంలో సస్పెన్స్ గాసిప్స్ తప్పవు.