Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో మ‌ళ్లీ అల్లా ఉద్దీన్ ఖిల్జీలా!

అందుకే బాలీవుడ్ మేక‌ర్స్ అంతా ప్ర‌యోగాలంటే ర‌ణ‌వీర్ సింగ్ తో నే చేయాలంటారు. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య‌ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ధురంధ‌ర్` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Feb 2025 7:28 AM GMT
ఆ స్టార్ హీరో మ‌ళ్లీ అల్లా ఉద్దీన్ ఖిల్జీలా!
X

బాలీవుడ్ నుంచి గ్రేట్ పెర్పార్మ‌ర్ లో ర‌ణ‌వీర్ సింగ్ ఒక‌రు. ఎలాంటి పాత్రనైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌డు. అది పాజిటివ్ రోల్ అయినా? నెగిటివ్ రోల్ అయినా ర‌ణ‌వీర్ పాత్ర‌లోకి ప‌రకాయ ప్ర‌వేశం చేయ‌నంత వ‌ర‌కే. చేసిన త‌ర్వాత ఆ పాత్ర‌కే వ‌న్నె వ‌స్తుంది. అంత గొప్ప న‌టుడు ర‌ణ‌వీర్. అందుకే బాలీవుడ్ మేక‌ర్స్ అంతా ప్ర‌యోగాలంటే ర‌ణ‌వీర్ సింగ్ తో నే చేయాలంటారు. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య‌ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ధురంధ‌ర్` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇండియా ఇంటిలిజెన్స్ ఏజెన్సీ చుట్టూ తిరిగే క‌థ ఇది. దీనిలో భాగంగా ర‌ణ‌వీర్ సింగ్ ర‌క‌ర‌కాల గెట‌ప్ ల్లో వెండి తెర‌పై క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఆన్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు కూడా లీక‌య్యాయి. లీకుల్ని బ‌ట్టి చూస్తే? ర‌ణ‌వీర్ ఒకే పాత్ర పోషిస్తున్నాడా? లేక ర‌క‌ర‌కాల పాత్ర‌లు పోషిస్తున్నాడా? అన్న అనుమానాలు సైతం క‌లుగుతున్నాయి.

ఇప్ప‌టికే త‌ల‌పాగా ధ‌రించి షూట్ బూటు వేసి అధికారి లుక్ లో అద‌ర‌గొట్టాడు. అలాగే మ‌రో లుక్ పాకిస్తాన్ యువ కుడిని ప‌రిచయం చేసాడు. పొడవాటి కుర్తా లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. తాజా లుక్ లో ర‌ణ‌వీర్ లో రౌద్రం హైలైట్ అవుతుంది. కండ‌లు తిరిగిన దేహం..పెరిగిన జుట్టు, గెడ్డం , క‌ళ్ల‌లో ప్ర‌త్య‌ర్దిపై క‌సి క‌నిపిస్తుంది. ఈ లుక్ మ‌రింత ప‌వర్ పుల్ గా ఉంది. గ‌తంలో ఇలాంటి లుక్ `ప‌ద్మావ‌త్` లోనూ హైలైట్ అయింది.

ఐకానిక్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్ర‌ను గుర్తు చేస్తుందంటూ తాజాగా నెటిజ‌నులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతు న్నారు. దానికి సంబంధించి క్లోజ‌ప్ పిక్ ని నెట్టింట షేర్ చేసి మా ఖిల్జీ అంటున్నారు. సినిమాలో న‌ట‌న ఊహించ‌ని విధంగా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు ధీమా వ్య‌క్తం చేసారు. ప్రేక్ష‌కుల అంచ‌నాలను మించి సినిమా ఉంటుంద‌న్నారు. అన్ని ప‌నులు పూర్తి చేసి ఏడాది చివ‌ర్లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.