Begin typing your search above and press return to search.

స‌తీమ‌ణితో క‌లిసి స్టార్ హీరో బిగ్ గ్యాంబ్లింగ్

ప్ర‌స్తుతం ఈ సినిమాని పూర్తి చేస్తూనే ర‌ణ‌వీర్ సింగ్ ఒక కొత్త ప‌ని మొద‌లు పెట్టాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   19 Feb 2025 8:30 AM GMT
స‌తీమ‌ణితో క‌లిసి స్టార్ హీరో బిగ్ గ్యాంబ్లింగ్
X

బాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో ర‌ణ్ వీర్ సింగ్ చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉన్నాడు. అతడు న‌టించిన భారీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగా మారాయి. చివ‌రి చిత్రం అజ‌య్ దేవ‌గ‌న్ తో క‌లిసి న‌టించిన‌ `సింఘం ఎగైన్` సైతం ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. దీంతో ర‌ణ‌వీర్ నిజంగానే నిరాశ‌ప‌డ్డాడు.

ప్ర‌స్తుతం డాన్ 3, దురంధర్ చిత్రాల్లో న‌టిస్తున్నాడు ర‌ణ‌వీర్. ఈ సినిమాల‌కు సంబంధించిన కొత్త అప్ డేట్లు రావాల్సి ఉంది. ఇంత‌కుముందు దురంధ‌ర్ లీక్డ్ వీడియోలు వైర‌ల్ అయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ సినిమాని పూర్తి చేస్తూనే ర‌ణ‌వీర్ సింగ్ ఒక కొత్త ప‌ని మొద‌లు పెట్టాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అత‌డు త్వ‌ర‌లో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్ట‌నున్నాడు. ప్రస్తుతం ముంబైలో విలాసవంతమైన ఆఫీస్ ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇందులో తన కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాడని పీపింగ్ మూన్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. నిర్మాత‌గా అత‌డు ఉన్న‌త‌మైన స్క్రిప్టుల కోసం వెతుకుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌లను వినడం ప్రారంభించాడని, ఆరంభ ద‌శ‌లో త‌న‌ నిర్మాణ సంస్థలో చారిత్ర‌క, పౌరాణిక డ్రామా క‌థ‌ల్ని ఓకే చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇది ఎవ‌రైనా చ‌రిత్ర‌కారుడి బ‌యోపిక్ అవుతుందా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఇక‌పోతే ర‌ణ‌వీర్ సింగ్ గతంలో మా కసమ్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. అయితే ఈ బ్యాన‌ర్ గురించి ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. అత‌డి స‌హ‌చ‌రి దీపిక కేఏ ప్రొడక్షన్స్ ని ప్రారంభించి సినిమాలు నిర్మించింది. కానీ ఇది కూడా క‌లిసి రాలేదు. ప్ర‌స్తుతం కొత్త నిర్మాణ సంస్థ‌ను స్థాపించ‌డం ద్వారా నిర్మాత‌లుగా రీవ్యాంప్ అవ్వాల‌ని చూస్తున్నారు. న‌టులుగా బిజీగా ఉన్నా కానీ, నిర్మాత‌లుగా స‌క్సెస‌వ్వాల‌నే పంతంతో ర‌ణ్ వీర్ - దీపిక కొత్త‌గా ప్ర‌తిదీ ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం దీపిక స‌హ‌కారంతో ర‌ణ‌వీర్ భారీ ప్లానింగ్ కి తెర తీసాడ‌ని తెలిసింది.