ఆ స్టార్ నో చెప్పినా...ఇతడు మాత్రం ఎస్!
సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 April 2024 9:20 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ ప్రకటనతోనే అంచనాలు తారా స్థాయికి చేరాయి. అటుపై ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అది పీక్స్ కి చేరింది. ఇది లొకేష్ మార్క్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు హిట్లతో రజనీకాంత్ ని వెండి తెరపై ఎలా చూపిస్తాడో? ఊహకి కూడా అందడం లేదు.
నెక్స్ట్ లెవల్ రజనీకాంత్ ని తెరపై ఆవిష్కరిస్తాడని అంతా విశ్వసిస్తున్నారు. అందుకు తగ్గట్టే చిత్రాన్ని భారీ కాన్వాస్ పైనే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ని కూడా సంప్రదించినట్లు వెలుగులోకి వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని ఖాన్ బాయ్ సున్నితంగా తిరస్కరించారు. పాత్ర నచ్చినా అలాంటి రోల్ తో పుల్ లెంగ్త్ లో సినిమా చేయాలని ఉందని చెప్పడంతో లోకేష్ ఇబ్బంది పెట్టలేదు.
తాజాగా ఇప్పుడా పాత్రకి మరో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ పాత్ర రణవీర్ కి ఎంతో నచ్చిందట. మరో మాట లేకుండా చేస్తానని ప్రామిస్ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. ఈ సినిమాకి `డేగ` అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ఈ నెలలోనే ఉన్నట్లు ఇప్పటికే లోకేష్ ప్రకటించారు.
ప్రస్తుతం లొకేష్ హీరోయిన్ ఎంపికలోనూ బిజీగా ఉన్నట్లు సమాచారం. రజనీకాంత్ ఇమేజ్ ..వయసుకు తగ్గ భామని రంగంలోకి దించనున్నారు. ఇప్పటికే త్రిష పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి తుదిగా ఎవరికా ఛాన్స్ వస్తుందన్నది చూడాలి. సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.