మాస్ పాటని మడతపెట్టావ్ గా బాస్!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్- రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఎక్కడున్నా! అక్కడో ఓ రకమైన ఎనర్జీ ఫామ్ అవుతుంది.
By: Tupaki Desk | 30 April 2024 8:27 AMబాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్- రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఎక్కడున్నా! అక్కడో ఓ రకమైన ఎనర్జీ ఫామ్ అవుతుంది. తమ ఎనర్జీ ఇతరులకు మంచి ఊపును తీసుకొస్తుంది. అలాంటింది ఇద్దరు ఒకే చోట చేరితే ఆ ఎనర్జీ డబుల్.. ట్రిపుల్ అయిపోదు. అక్కడిక రచ్చ రంబోలా జరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. ఇటీవలే స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె వివాహం చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ముంబై నుంచి రణవీర్ సింగ్ కూడా దిగాడు.
అలాగే దేవీ శ్రీకూడా అటెండ్ అయ్యాడు. దీంతో పెళ్లిలో ఒక్కసారిగా ఆటపాటతో ఆ ఇద్దరు జోష్ నింపేసారు. `ఊ అంటావా..ఊఊ అంటావా` అంటూ సాగే మాస్ పాటకి ఇద్దరు తమదైన శైలిలో స్టెప్పులేసి అలరించారు. అందులోనూ రణవీర్ ఎనర్జీ అయితే మామూలుగా లేదు. హిప్ స్టెప్ ని ఉన్నది ఉన్నట్లుగా దించేసాడు. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ అలాగే క్యారీ చేసాడు. పక్కనే రాక్ స్టార్ కూడా కాలు కదిపాడు. ఇక ఫైనల్ గా శంకర్ డాటర్ కూడా నాలిక మడతపెట్టి మరీ షేక్ ఆడించేసింది.
రణవీర్ డాన్సు చేస్తుంటే కిందకు వంగి మరీ ప్లోర్ స్టెప్ అందుకుంది. ఆసమయంలో శంకర్ సహా కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారు. కుమార్తె లైవ్ పెర్పార్మెన్స్ చూసి ఫ్యామిలీ అంతా షాక్ అయింది. మా అమ్మాయిలో ఇంత ఉందా? అనుకున్నారంతా. దానికి సంబంధించిన వీడియోని ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా దేవిశ్రీప్రసాద్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. రణవీర్ సింగ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సౌత్ సెలబ్రిటీస్ తో ఇంటరాక్ట్ అవుతోన్న సంగతి తెలిసిందే.
అందులోనూ శంకర్ తో మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా కూడా సెట్ అయింది. అపరిచితడు రీమేక్ ని బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో శంకర్ ప్లాన్ చేసారు. కానీ రైట్స్ విషయంలో నిర్మాతతో వివాదాలు ఉండటంతో! మరో కథతో రణవీర్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. గేమ్ ఛేంజర్..ఇండియన్ -2 తర్వాత శంకర్ పట్టాలెక్కించేది రణవీర్ చిత్రాన్నే.