'డాన్ 3' లో ఖాన్ స్థానంలో రణవీర్.. నిర్మాత వెర్షన్ ఇదీ..
అయితే మూడో భాగంలో షారూఖ్ స్థానంలో రణవీర్ సింగ్ భయంకరమైన అలాగే కూల్ గ్యాంగ్‌స్టర్‌గా డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో నటించనున్నారు.
By: Tupaki Desk | 24 Sep 2023 1:30 AM GMTనటుడు, దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ ఎట్టకేలకు షారుఖ్ ఖాన్ స్థానంలో రణవీర్ సింగ్‌ని డాన్ 3 కోసం తీసుకున్నాడు. 2006లో అమితాబ్ బచ్చన్ క్లాసిక్ డాన్ (1978)ని షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా రీమేక్ చేసాడు. దీనికి స్వయంగా ఫర్హాన్ దర్శకత్వం వహించగా బ్లాక్ బస్టర్ అయింది. 2011లో ఫర్హాన్ తిరిగి షారూఖ్ తో 'డాన్ 2'ని తెరకెక్కించాడు. ఇది నష్టాలు లేని ప్రాజెక్ట్. డాన్ 2 తర్వాత 12 సంవత్సరాలకు యాక్షన్ ఎంటర్ టైనర్ లో మూడవ భాగం ఎట్టకేలకు ప్రకటించారు. అయితే మూడో భాగంలో షారూఖ్ స్థానంలో రణవీర్ సింగ్ భయంకరమైన అలాగే కూల్ గ్యాంగ్‌స్టర్‌గా డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో నటించనున్నారు.
డాన్ 3 ప్రకటించినప్పటి నుండి SRK అభిమానులు వేరొక నటుడిని ఎంపిక చేయడంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫర్హాన్ దీనిపై స్పందించాడు. ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ తాను షారుఖ్‌ను భర్తీ చేయలేదని ఫర్హాన్ స్పష్టం చేశాడు. స్క్రిప్టు పరంగా ఒకరితో ఒకరు ఏకీభవించనందున సమ్మతిపూర్వకంగా విడిపోయామని తెలిపారు. ఫర్హాన్ మాట్లాడుతూ, ''నేను ఎవరినీ భర్తీ చేసే స్థితిలో లేను. ఇవి మేము చాలా సంవత్సరాలుగా చర్చించుకున్న విషయాలు. కథతో ఒక నిర్దిష్ట దిశలో వెళ్లాలని నేను కోరుకున్నాను. కానీ ఏదో ఒకవిధంగా కలిసి పని చేసే స్థితి లేదు. అందుకే మేం ఇప్పుడే విడిపోయాము. ఇది బహుశా ఉత్తమమైన నిర్ణయమని పరస్పరం తెలుసుకున్నాం. కాబట్టి దీనిని అర్థం చేసుకోండి'' అని అన్నారు.
ఫ్రాంచైజీలో రణ్‌వీర్ చేరిక గురించి ఫర్హాన్ క్లారిటీగా నొక్కిచెప్పాడు. ''రణ్‌వీర్ నటిస్తున్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. అతను చాలా ఛార్జ్ అయ్యాడు. ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఒక పెద్ద చిత్రం.. పూర్తిగా రణ్ వీర్ కోణం నుండి.. ఇది చాలా పెద్ద విషయం. మేం అతడితో పని చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. అతడి శక్తి మనకు శక్తినిస్తుంది..'' అని అన్నారు.
డాన్ 3 ప్రకటన ప్రోమో విడుదల కాకముందే ఫర్హాన్ అక్తర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేశాడు. ఆ ప్రకటన సారాంశం ఇలా ఉంది. 1978లో సలీం-జావేద్ సృష్టించిన పాత్ర మిస్టర్ అమితాబ్ బచ్చన్ తో అప్రయత్నంగా ఎలా చిత్రీకరించారు? అంటే అది గొప్పగా క్యాప్చర్ చేసినది. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ ప్రేక్షకుల ఊహను నిజం చేసిన సినిమా అది. సమస్యాత్మకమైన పాత్ర డాన్.. సవాళ్లతో కూడుకున్నది. 2006లో డాన్‌ని షారుఖ్ ఖాన్ తనదైన శైలితో ఎదురులేని వాడిగా చేసి చూపించాడు. తన పాత్రకు జీవం పోశాడు. .. అని అన్నాడు.
డాన్ వారసత్వాన్ని ఇకపైనా ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది. ఈ కొత్త సినిమాలో మాతో చేరేవాడు ప్రతిభావంతుడు. మీరు ఇతర డాన్ లపై ఉన్న ప్రేమను అతడిపైనా చూపుతారని మేము ఆశిస్తున్నాము. మిస్టర్ బచ్చన్ -షారూఖ్ ఖాన్‌ల అభిమానులు ఉదారతను చూపించంది. డాన్ కొత్త శకం 2025లో ప్రారంభమవుతుంది. డాన్ 3 చిత్రం 2025 విడుదలవుతుంది అని తెలిపారు.