స్మగ్లింగ్ చేస్తూ దొరికిన నటి.. తండ్రి ఆవేదన!
కన్నడ నటి రణ్యా రావును 3 మార్చి 2025న బెంగళూరులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అరెస్టు చేసింది.
By: Tupaki Desk | 6 March 2025 8:59 AM ISTకన్నడ నటి రణ్యా రావును 3 మార్చి 2025న బెంగళూరులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అరెస్టు చేసింది. ఆమె కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ కె రామచంద్రరావు సవతి కూతురు. కెంపాగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రణ్యా నుండి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని, పోలీసులు అరెస్టు చేశారు.
అయితే తన కుమార్తె కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ రావు టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. రాణ్యా నాలుగు నెలల క్రితం వివాహం చేసుకుంది. అప్పటి నుండి మమ్మల్ని కలవనేలేదు. ఆమె లేదా ఆమె భర్త వ్యాపార లావాదేవీల గురించి మాకు తెలియదు. ఇది చాలా షాక్ కి గురి చేసింది.. నిరాశను కలిగించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అని అన్నారు.
బంగారు స్మగ్లింగ్‌లో రణ్య ప్రమేయం ఉందని అనుమానించిన డిఆర్ ఐ అధికారులు, ఆమె రాకకు ముందే విమానాశ్రయంలో ఒక బృందాన్ని ఉంచారు. రణ్యారావు విమానం దిగిన తర్వాత డి.ఆర్.ఐ అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంది. 4 మార్చి 2025న ఆర్థిక నేరాల విచారణ కోసం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు రణ్యను హాజరుపరిచారు. అటుపై 18 మార్చి 2025 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కస్టడీకి బదిలీ చేయడానికి ముందు రణ్య బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది.
విచారణ సమయంలో తన దుబాయ్ పర్యటన బిజినెస్ కోసమేనని పేర్కొంది. అయితే భారతదేశానికి అక్రమంగా బంగారం రవాణా చేస్తోందని డి.ఆర్.ఐ అధికారులు ఆరోపిస్తున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. బంగారం మొత్తం 14.8 కిలోగ్రాములు ఆమె వద్ద ఉంది. దీనిపై ఆరోపణలు రావడంతోనే గాయని అరెస్ట్ అయింది.
కర్ణాటకలోని చిక్‌మగళూరుకు చెందిన రణ్యా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే ముందు బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ చదివారని తెలుస్తోంది. ఆమె 2014లో సుదీప్ దర్శకత్వం వహించి నటించిన కన్నడ చిత్రం `మాణిక్య`తో తన నటనా రంగ ప్రవేశం చేసింది.