Begin typing your search above and press return to search.

ర‌న్యారావు స్మ‌గ్లింగ్ కేసులో తెలుగు న‌టుడు ఎవ‌రు?

క‌న్న‌డ న‌టి ర‌న్యారావు బంగారం స్మ‌గ్లింగ్ కేసులో తీగ లాగితే డొంకంతా క‌దులుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 March 2025 6:00 AM IST
ర‌న్యారావు స్మ‌గ్లింగ్ కేసులో తెలుగు న‌టుడు ఎవ‌రు?
X

క‌న్న‌డ న‌టి ర‌న్యారావు బంగారం స్మ‌గ్లింగ్ కేసులో తీగ లాగితే డొంకంతా క‌దులుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌న్యారావు పెళ్లి వీడియో గెస్టుల్ని కూడా పోలీసులు ప‌రిశీలించి వారిపై ఆరాలు తీస్తున్నారు. దుబాయ్ నుండి 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టయిన రన్యా రావు (33), తన సహచరుడు, నిందితుడు అయిన‌ తెలుగు నటుడి అమెరికా పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి త‌నిఖీల్లో దొర‌క్కుండా బంగారాన్ని త‌ప్పుడు విధానంలో ర‌వాణా చేసార‌ని దర్యాప్తులో తేలింది.

వారం క్రితం రన్యా రావుకు బెయిల్ విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టులో స‌మ‌ర్పించిన‌ పత్రాలలో, ఆమెను అరెస్టు చేసిన ఏజెన్సీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌.ఐ) - దుబాయ్ కస్టమ్స్ డిక్లరేషన్లలో ఆమె బంగారాన్ని జెనీవాకు తరలిస్తున్నట్లు చెప్పుకున్నార‌ని పేర్కొంది. బెంగ‌ళూరు విమానాశ్రయంలో అరెస్టు అయిన తర్వాత ర‌న్యారావు నివాసంలో లభించిన రెండు దుబాయ్ కస్టమ్స్ డిక్లరేషన్ పత్రాలు - 13 నవంబర్ 2024 , 20 డిసెంబర్ 2024 తేదీలతో ఆమె జెనీవాకు బంగారాన్ని రవాణా చేస్తున్నట్లు దుబాయ్‌లో ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే జెనీవా బదులుగా బంగారాన్ని భారతదేశానికి తరలించార‌ని బెయిల్ పిటిషన్‌ను వ్య‌తిరేకించిన‌ డిఆర్ఐ పత్రాలలో పేర్కొన్నారని జాతీయ మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది.

ఆర్థిక నేరాలకు సంబంధించిన‌ ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 14న రన్యా రావు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పుడు ర‌న్యా బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు తెలుగు న‌టుడు బెయిల్ కోసం ఆర్థిక నేరాల కోసం ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.