Begin typing your search above and press return to search.

మ‌జాకాలో ఐకానిక్ సీన్ గురించి చెప్పిన రావు ర‌మేష్

సినిమా మొత్తంలో ఆ హీరోయిన్ ను ఇంప్రెస్ చేయ‌డానికి రావు ర‌మేష్ ఎన్ని పాట్లు పడ‌తాడో ట్రైల‌ర్ లో చాలా క్లియ‌ర్ గా చూపించారు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 11:30 AM GMT
మ‌జాకాలో ఐకానిక్ సీన్ గురించి చెప్పిన రావు ర‌మేష్
X

సందీప్ కిష‌న్, రావు ర‌మేష్, రీతూ వ‌ర్మ‌, అన్షు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన సినిమా మ‌జాకా. ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ క‌థ అందించిన ఈ సినిమాకు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 26న రిలీజ్ కానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర పడుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ సినిమాను తెగ ప్ర‌మోట్ చేస్తుంది.

టీజ‌ర్ వ‌ర‌కు మంచి ఆస‌క్తి క‌లిగించిన ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక ఆ అంచ‌నాలు తారుమార‌య్యాయి. ట్రైల‌ర్ చూశాక క‌థ పెద్ద‌గా ఆస‌క్తిగా ఏమీ అనిపించ‌లేదు. అంతేకాదు మ‌జాకా క్రింజ్ కామెడీ మూవీలా అనిపిస్తుంది. కానీ సినిమాలో మంచి ఎమోష‌న్ ఉంద‌ని, ఆ ఎమోష‌నే సినిమాను నిల‌బెడుతుంద‌ని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రావు ర‌మేష్ మొద‌టిసారిగా ఓ ప్రేమికుడి పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ లో క‌నిపిస్తున్నాడు. త‌న‌కు ఓ హీరోయిన్ కూడా ఉంది. సినిమా మొత్తంలో ఆ హీరోయిన్ ను ఇంప్రెస్ చేయ‌డానికి రావు ర‌మేష్ ఎన్ని పాట్లు పడ‌తాడో ట్రైల‌ర్ లో చాలా క్లియ‌ర్ గా చూపించారు.

అయితే చిత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రావు ర‌మేష్ మ‌జాకాలో ఓ సీన్ గురించి చాలా గొప్ప‌గా చెప్తున్నాడు. సినిమాలో రెండు ఎమోష‌నల్ సీన్స్ ఉంటాయ‌ని, వాటిలో ఒక‌టి త‌న‌కు, అన్షుకు మ‌ధ్య ఉంటుంద‌ని, రెండోది రీతూ వ‌ర్మ‌కు త‌న‌కు మ‌ధ్య ఉంటుంద‌ని చెప్పాడు. రీతూ తో త‌న సీన్ చాలా ఎమోష‌నల్ గా ఉంటుంద‌ని చెప్పాడు రావు ర‌మేష్.

రిలీజ్ కు ముందే చెప్తే ఓవ‌ర్ గా చెప్పిన‌ట్టు ఉంటుంది కానీ రిలీజ‌య్యాక ఆ సీన్ ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అయితే మాత్రం ప‌ర్టిక్యుల‌ర్ ఎమోష‌నల్ సీన్స్ లో అదొక ఐకానిక్ సీన్ అవుతుంద‌ని రావు ర‌మేష్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. తాను ఈ సినిమా కోసం మొత్తం 42 రోజుల పాటూ వ‌ర్క్ చేశాన‌ని, సినిమా చూశాక ప్ర‌తి ఒక్క‌రూ క‌డుపుబ్బా న‌వ్వుకుంటార‌ని రావు ర‌మేష్ తెలిపాడు.