ఒక్క రోజుకు రావు రమేష్ రెమ్యునరేషన్ ఎంతంటే..
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు రావు రమేష్.
By: Tupaki Desk | 28 Aug 2024 5:15 AM GMTటాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు రావు రమేష్. సీనియర్ యాక్టర్ రావుగోపాలరావు తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ అనతికాలంలోనే నటుడిగా స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. విభిన్న క్యారెక్టర్స్ లలో తనని తాను ప్రూవ్ చేసుకొని కెరియర్ ని బిల్డ్ చేసుకున్నారు. ఒకానొక సమయంలో సమయంలో తెలుగులో లీడింగ్ యాక్టర్స్ లలో ఒకడిగా రావు రమేష్ దూసుకుపోయారు.
ఇప్పుడు కూడా టాలీవుడ్ లో స్టార్ యాక్టర్స్ లలో ఒకడిగా అతను కెరియర్ కొనసాగిస్తున్నారు. అయితే ఒకప్పటిలా స్పీడ్ గా వచ్చిన ప్రతి అవకాశాన్ని రావు రమేష్ ఒప్పుకోవడం లేదు. సెలక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకొని వెళ్తున్నారు. తన క్యారెక్టర్ కి మంచి ప్రాధాన్యత ఉంది అనుకుంటేనే ఒప్పుకుంటున్నారు. అయిన కూడా తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావు రమేష్ ఉన్నారు.
ఆయన ఓక రోజుకి 4.5 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే రావు రమేష్ లీడ్ రోల్ లో నటించిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా తాజాగా థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో రావు రమేష్ హీరో అనొచ్చు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం అందరికి కనెక్ట్ అయ్యింది.
ఇదిలా ఉంటే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సక్సెస్ అయిన సందర్భంగా రావు రమేష్ పలు యుట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి రావు రమేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేను 4.5 లక్షల కంటే ఎక్కువ తీసుకున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. అయితే నేను తీసుకునే ప్రతి రూపాయి వైట్ రూపంలోనే తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే నా రెమ్యునరేషన్ కి ట్యాక్స్ కూడా కడుతున్నానని అన్నారు.
అన్ని సినిమాలకి ఒకే తరహా రెమ్యునరేషన్ ఉండదని, మూవీ స్టోరీ, అందులో క్యారెక్టర్ బట్టి రెమ్యునరేషన్ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పెద్ద ప్రాజెక్ట్స్ లలో చేసినపుడు ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందని తెలిపారు. కొంతమంది 100 అడిగితే 50 రూపాయిలు ఇస్తామని బేరాలు ఆడుతారని అన్నారు. అయితే క్యారెక్టర్ నచ్చితే ఎంత రెమ్యునరేషన్ లో అయిన చేస్తానని రావు రమేష్ తెలిపారు.
పాన్ ఇండియా ట్రెండ్ వచ్చి ఇతర భాషల నుంచి వచ్చే నటీనటులు నా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయిన పక్కనే ఉన్నాం కదా అని మనల్ని పిలిచి అవకాశాలు ఇవ్వాలని ఆశించకూడదు. ఏ క్యారెక్టర్ కి ఎవరిని తీసుకోవాలనేది దర్శక, నిర్మాతల ఛాయస్. వారికి నచ్చిన యాక్టర్స్ ని తీసుకునే హక్కు వారికుంటుంది. అయినంత మాత్రాన నాకు అవకాశాలు రాకపోవడం లేదు. కానీ నేనే సెలక్టివ్ గా మూవీస్ చేస్తున్నాను అని రావు రమేష్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.