Begin typing your search above and press return to search.

రావు గారి దగ్గర కాస్ట్ లీ ప్రైవసీ..!

ఈమధ్య సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఉంటున్నారు. వీటి మాయలో పడి ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారని తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Aug 2024 5:33 AM GMT
రావు గారి దగ్గర కాస్ట్ లీ ప్రైవసీ..!
X

ఈమధ్య సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఉంటున్నారు. వీటి మాయలో పడి ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారని తెలిసిందే. ఈతరం యువత మొత్తం ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. దీని వల్ల 10 శాతం ఉపయోగం ఉంటే 90 శాతం నష్టాలే ఉన్నాయి. అయినా కూడా సెల్ ఫోన్ కొన్నామా సోషల్ మీడియాలో ఉన్నామా లేదా అన్నట్టు చూస్తున్నారు. ఐతే కామన్ మ్యాన్ ఇలా ఉంటే సెలబ్రిటీలు ఇంకెలా ఉంటారు. వారు తమ గురించి చెప్పే లేదా సోషల్ మీడియాలో పంచుకునే ప్రతి విషయం ఫ్యాన్స్ ని అలరిస్తుంది. అందుకే వారి ఫాలోవర్స్ సంఖ్య గురించి కూడా మాట్లాడుకుంటారు.

సెలబ్రిటీ హోదా వచ్చిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో రావాల్సిందే అన్న రూలేం లేదు కానీ దాదాపు 99 శాతం మంది ఉంటారు. ఎవరో ఒకరు ఇద్దరు తప్ప అందరు సోషల్ మీడియాలో మాయలో పడిపోతారు. అలాంటి ఒకరిద్దరిలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ ఉన్నారు. స్టార్ సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా విలన్, సపోర్ట్ రోల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్రకైనా తాను రెడీ అంటుంటారు రావు రమేష్. రావు గోపాల్ రావు తనయుడిగా ఆయన పేరు వాడకుండా సినిమాల్లోకి వచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఆయన నటించిన మారుతి నగర్ సుబ్రమణ్యం రిలీజ్ కు రెడీ అయ్యింది. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సుకుమార్ తబిత సమర్పణలో రిలీజ్ అవుతుంది. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు అటెండ్ అయ్యారు. ఈ వేడుకలో భాగంగా రావు రమేష్ తాను ఎందుకు సోషల్ మీడియాలో రాలేదో చెప్పారు. చాలామంది దర్శకులు తన దగ్గరకు వచ్చి మా దగ్గర లేని విలువైనది మీ దగ్గర ఉంది అన్నారట. అదేంటి అంటే ప్రైవసీ అని అన్నారట. సోషల్ మీడియాలో ఉండటం వల్ల తమ ప్రైవసీ లేకుండా పోయిందని.. మీరు ప్రశాంతంగా ఉన్నారని అన్నారట. అందుకే తాను ఇప్పటివరకు సోషల్ మీడియాలో లేనని అన్నారు రావు రమేష్.

ఐతే యాంకర్ సుమ మాత్రం మీరు అలా ప్రశాంతంగా ఉండటం ఎందుకు మీరు కూడా సోషల్ మీడియాలోకి వచ్చేయండి అని అడిగితే ఆయన సరే అని అన్నారు. సోషల్ మీడియా అనే కాదు రావు రమేష్ చాలా సినిమాల్లో నటించినా సరే ఆయన ఎక్కువగా ఈవెంట్స్ లో కూడా కనిపించరు. తెర మీద ఆయన తన ప్రతిభ తో అలరిస్తారు కానీ ఇలా ఈవెంట్స్ కు వచ్చి మాట్లాడాలని అనుకోరని తెలుస్తుంది. మొత్తానికి సుమ వల్ల రావు రమేష్ ప్రైవసీ కోల్పోయి అదే సోషల్ మీడియాలోకి వస్తానని చెప్పారు.