అదితీకి సిధ్ ప్రపోజ్ చేస్తున్న రేర్ ఫోటో
''ధన్యవాదాలు 2024.. 2025కి స్వాగతం-దయగా ఉండండి….నూతన సంవత్సర శుభాకాంక్షలు!'' అనే క్యాప్షన్ తో అదితీ షేర్ చేసిన ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
By: Tupaki Desk | 2 Jan 2025 3:45 AM GMTఅదితి రావ్ హైదరీ- సిద్ధార్థ్ 2024 సెప్టెంబర్ లో తెలంగాణలోని ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారు. దీని తరువాత దీపావళి సమయంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని అలీలా ఫోర్ట్ బిషన్‌గఢ్‌లో రెండోసారి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల అదితి సోషల్ మీడియాలో కొన్ని అద్భుతమైన పెళ్లి ఫోటోలను షేర్ చేసారు. వీటిలో అతిదీకి సిద్ధార్థ్ ప్రపోజ్ చేస్తున్న ఓ అరుదైన పోటోగ్రాఫ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
''ధన్యవాదాలు 2024.. 2025కి స్వాగతం-దయగా ఉండండి….నూతన సంవత్సర శుభాకాంక్షలు!'' అనే క్యాప్షన్ తో అదితీ షేర్ చేసిన ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. అభిమానులు కామెంట్ సెక్షన్ లో ఈ జంటపై చాలా ప్రేమను కురిపించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు! శ్రీమతి శ్రీ సిద్ధు యాడ్ ..అని విషెస్ తెలిపారు.
అదితి రావ్ హైదరీ గతంలో నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. కానీ ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను సత్యదీప్ వివాహం చేసుకున్నారు. సత్యదీప్- మసాబా ఇప్పుడు తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. అదితి 21 వయసులో సత్యదీప్ ని 2007లో పెళ్లాడింది. 2013లో విడాకులు ప్రకటించారు. విడిపోవడానికి గల కారణాలను అదితి కానీ, సత్యదీప్ కానీ వెల్లడించలేదు. సిద్ధార్థ్‌కి మేఘనా నారాయణ్‌తో నవంబర్ 2003లో వివాహం జరిగింది. వారు న్యూ ఢిల్లీలో అదే పరిసరాల్లో పెరుగుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు. 2006 ప్రారంభం నుంచి విడివిడిగా ఉన్నారు. చివరికి జనవరి 2007లో విడాకులు తీసుకున్నారు. సిద్ధార్థ్- అదితీ వారి రెండో పెళ్లితో ఆనందకర జీవితంలోకి అడుగుపెట్టారు.