Begin typing your search above and press return to search.

మామ్ ని త‌ల‌పించిన స్వీట్ డాట‌ర్ క్యూట్ లుక్!

తెరంగేట్రానికి ముందే క‌వ‌ర్ పేజీలో హాట్ ఫోజుల‌తో అద‌రగొడుతుంది.

By:  Tupaki Desk   |   23 Aug 2024 2:30 AM GMT
మామ్ ని త‌ల‌పించిన స్వీట్ డాట‌ర్ క్యూట్ లుక్!
X

బాలీవుడ్ కి మ‌రో న‌ట వార‌సురాలు ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ర‌వీనా టాండ‌న్ కుమార్తె రాషా త‌డానీ అజ‌య్ దేవ‌గ‌ణ్ మేన‌ల్లుడు ఆమ‌న్ దేవ‌గ‌ణ్ తో న‌టిస్తోన్న చిత్రంతో లాంచ్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అయితే అంత‌కంటే ముందే అమ్మ‌డు నెటి జ‌నుల అటెన్ష‌న్ డ్రా చేస్తోంది. తెరంగేట్రానికి ముందే క‌వ‌ర్ పేజీలో హాట్ ఫోజుల‌తో అద‌రగొడుతుంది.


సోష‌ల్ మీడియాలో అంత‌కంత‌కు పాపులారిటీ పెంచుకుంటుంది. ఇప్ప‌టికే రాషా త‌డానీ సిరీస్ నుంచి రిలీజ్ అయిన ఫోటోల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా అమ్మ‌డు గ్రాజియా ఇండియ క‌వ‌ర్ పేజీపై హోయ‌లు పోయిన తీరు ఇంట్రెస్టింగ్. అమ్మ‌డు బ్లూ క‌ల‌ర్ డిజైన‌ర్ ప్లోర‌ల్ దుస్తుల్లో స్కిన్ షోతో ఆక‌ర్షిస్తుంది. ప్లోర్ పై ప‌డుకుని వ‌య్యారమైన భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది.

అమ్మ‌డి మ్యాక‌ప్ అలంక‌ర‌ణ‌..హెయిర్ స్టైల్ ప్ర‌తీది ఎంతో అందంగా హైలైట్ చేస్తున్నాయి. అన్నింటినీ మించి ర‌వీనా టాండ‌న్ నోటి నుంచి ఊడిప‌డిన‌ట్లే ఉంది. అచ్చంగా అమ్మ‌నే మ‌రిపిస్తుంది. క‌ళ్లు.. ముక్కు. .పెదాలు ముఖ‌మంతా అమ్మ‌కు అచ్చుగుద్దినట్లే ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ర‌వీనా బాగా తెలిసిన వారంతా? అమ్మ‌కు జెరాక్స్ కాపీ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇక న‌టిగా రాషా తడానికి మామ్ కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చింది. పెద‌వి ముద్దుల‌కు మామ్ యాంటీ అయినా కుమార్తె విష‌యంలో మాత్రం అలాంటి కండీష‌న్లు పెట్ట‌నని, త‌న‌కి న‌చ్చిన‌ట్లు న‌టించ‌వ చ్చు..ఉండొచ్చ‌ని చెప్పింది. ఆ మ‌ధ్య రాషా త‌డానీని ఓ తెలుగు సినిమాకి కూడా తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. కానీ ఛాన్స్ వ‌చ్చిన‌ట్లు లేదు.